దేవర ఓటీటీ రిజల్ట్ ఎలా ఉందంటే?

ఓటీటీలో ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Update: 2024-11-09 07:30 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ థియేటర్స్ లో ఏకంగా 400 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. ముఖ్యంగా తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చాయి. మిగిలిన భాషలలో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఇక తాజాగా ‘దేవర’ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఓటీటీలో ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రభాస్ ‘సలార్’, ‘కల్కి 2898ఏడీ’, రాకింగ్ స్టార్ ‘కేజీఎఫ్ సిరీస్’ తరహాలో ‘దేవర’ మూవీ కూడా ఓటీటీ ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉందా అనేది చూడాలి. నవంబర్ 8న ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యింది. రెండు, మూడు రోజుల్లో ఇండియాలో టాప్ ట్రెండింగ్ సినిమాల జాబితాలోకి ఈ చిత్రం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీని క్లిప్స్ ని కట్ చేసి అప్పుడే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

ముఖ్యంగా అనిరుద్ కంపోజ్ చేసిన చుట్టమల్లే సాంగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఈ సాంగ్ కి అనిరుద్ రవిచందర్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడని కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బక్కతల, అనిగాడ్ అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అలాగే మూవీలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేస్తూ ఫ్యాన్స్ మరోసారి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జాన్వీ కపూర్ గ్లామర్ షోకి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.

ఓటీటీలో ‘దేవర’ రిలీజ్ అయ్యాక ఓవరాల్ గా చూసుకుంటే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఫొటోగ్రఫీ పైన ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ ఫైట్ లోనే కెమెరా బ్లాక్స్ సరిగా పెట్టలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. లైటింగ్ కూడా కరెక్ట్ గా సెట్ చేయలేదని అంటున్నారు. అంత పెద్ద సినిమాటోగ్రాఫర్ అయ్యుండి, మరీ అంత పూర్ గా విజువలైజేషన్ ఎలా చేశాడంటూ ప్రశ్నిస్తున్నారు.

కొరటాల శివ కూడా ఆ విజువల్స్ ని ఒకే చేయడం బాగోలేదని పోస్టులు పెడుతున్నారు. అయితే సినిమా పరంగా యాక్షన్ ఘట్టాలు పవర్ ఫుల్ గా ఉండటంతో పాటు అనిరుద్ ఎలివేషన్ మ్యూజిక్ కూడా అద్భుతంగా సెట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ కూడా ‘దేవర’ చిత్రాన్ని బాగానే ఆదరిస్తున్నారు. ఇక ఎన్ని రోజులు ఈ చిత్రం ట్రెండింగ్ లో ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News