దేవర.. యూఎస్ లో కుమ్మేసేలా ఉంది

అమెరికాలో దేవర మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో జోరు చూపిస్తుంది.

Update: 2024-09-11 09:50 GMT

అమెరికాలో దేవర మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో జోరు చూపిస్తుంది. దేవర ట్రైలర్ రిలీజ్ కి ముందే ప్రీమియర్స్ షోలకి 15000 టికెట్స్ బుక్ కావడం ఒక రికార్డ్ గా చెప్పుకోవాలి. ట్రైలర్ రిలీజ్ తర్వాత టికెట్ బుకింగ్స్ ఇంకా పెరిగాయంట. స్పెషల్ ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ డే షోలకి నార్త్ అమెరికాలో ఉన్న ఇండియన్స్ భారీగా రెస్పాన్స్ వస్తోంది. దీంతో ముందస్తుగానే టికెట్లు బుక్ చేస్తూ సంచలన రికార్డులు దేవరకి ఇస్తున్నారు.


యూఎస్ఏలో దేవర మూవీ ప్రీమియర్స్ షోల అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ 30 వేలకి చేరినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. మూవీ రిలీజ్ కి మరో 17 రోజులు ఉండగానే ప్రీమియర్స్ షోలకి 30 వేల టికెట్స్ బుక్ అయ్యాయని పోస్టర్ లో పేర్కొన్నారు. ఈ స్థాయిలో అడ్వాన్స్ టికెట్స్ బుక్ కావడం అనేది ఆషామాషీ విషయం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇకపై కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇదే జోరు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రిలీజ్ నాటికి ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ 40వేల మార్క్ క్రాస్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

నిజానికి ఎన్టీఆర్ కి యూఎస్ఏ మార్కెట్ లో క్రేజ్ ఉన్న కూడా ఈ స్థాయిలో రెస్పాన్స్ ఇది వరకు ఎప్పుడూ కూడా రాలేదు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ఇంపాక్ట్, దేవర సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ పెరగడానికి కారణం అనే మాట వినిపిస్తోంది. అలాగే తెలుగు సినిమాలకి ఈ మధ్యకాలంలో అమెరికాలో మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందింది. అక్కడి థియేటర్స్ కూడా టాలీవుడ్ సినిమాలని ఎక్కువగా రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయంట.

ఇది కూడా దేవర సినిమాకి కలిసొచ్చినట్లు అంచనా వేస్తున్నారు. దేవర సినిమాతో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ దేవర చిత్రంలో ప్రతినాయకుడిగా నటించాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలలో నటించారు. ట్రైలర్ లో ప్రకాష్ రాజ్ వాయిస్ తో దేవర గురించి నేరేట్ చేసిన విధానం ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది.

ప్రకాష్ రాజ్ ఇచ్చే ఎలివేషన్ దేవర మూవీ కంటెంట్ పైన హైప్ క్రియేట్ చేసింది. ఇదే హైప్ ని రిలీజ్ వరకు కొనసాగితే వరల్డ్ వైడ్ గా 150 కోట్ల కలెక్షన్స్ గ్రాస్ ని దేవర మూవీ వసూళ్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఏడాది కల్కి తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ దేవర అందుకుంటుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News