దేవర… కోలీవుడ్ బిజినెస్ లెక్క ఎంతంటే?

నెక్స్ట్ ఈ సినిమా నుంచి రాబోయే ట్రైలర్ తో ఎక్స్ పెక్టేషన్స్ ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు.

Update: 2024-08-31 05:17 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోయే మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. నందమూరి ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే దేవర మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపైన అంచనాలు పెరిగాయి. నెక్స్ట్ ఈ సినిమా నుంచి రాబోయే ట్రైలర్ తో ఎక్స్ పెక్టేషన్స్ ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు.

దేవర మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయ్యిందంట. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రంలో థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ కలిపి 350 కోట్ల వ్యాపారం జరిగిందంట. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ జరిగిన చిత్రంగా దేవర ఉంది. ఈ సినిమా మీద ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ నేపథ్యంలో మొదటి రోజు భారీ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

70 నుంచి 100 కోట్ల మధ్యలో మొదటి రోజు ఓపెనింగ్స్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తమిళ్ రైట్స్ ని కూడా ఫ్యాన్సీ ధరకి అమ్ముడయ్యాయి. శ్రీ లక్ష్మి మూవీస్ దేవర తమిళ్ రిలీజ్ రైట్స్ ని 7.5 కోట్లకి సొంతం చేసుకుందంట. ఈ లెక్క చూస్తుంటే ఓ విధంగా మంచి బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు. దేవర మూవీ తమిళంలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 18 కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ కి తమిళనాట కూడా ఓ మోస్తారు క్రేజ్ ఉంది. ప్రమోషన్ చేస్తే మరీంత ఫోకస్ పెరగవచ్చు.

ఈ నేపథ్యంలో 18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే మాట వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకి తమిళంలో 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా తర్వాత తారక్ కి తమిళ్ సర్కిల్ లో ఇమేజ్ పెరిగింది. అక్కడ చాలా మంది మేకర్స్, హీరోస్ లు దేవర సినిమాని ప్రమోట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా అనిరుధ్ ద్వారా కోలీవుడ్ నుంచి బూస్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఇక దేవర మూవీకి కోలీవుడ్ ఇండస్ట్రీ సపోర్ట్ లభించి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే తమిళనాట మంచి వసూళ్లని అందుకుంటుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అతిలోక సుందరి కూతురుగా ఆమె సౌత్ ఎంట్రీ ఇస్తూ ఉండటంతో కొంత క్రేజ్ ఉంది. సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ టైం తీసుకొని పెర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా దేవర మూవీని తెరకెక్కిస్తున్నారు.

Tags:    

Similar News