దేవర బాక్సాఫీస్.. 500 కోట్లతో న్యూ సెన్సేషన్

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రీసెంట్ గా దేవర పార్ట్-1 ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-10-13 09:56 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రీసెంట్ గా దేవర పార్ట్-1 ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27వ తేదీన విడుదలైన ఆ సినిమా.. మంచి రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది. రివ్యూస్ తో సంబంధం లేకుండా వసూళ్లను రాబడుతోంది. దసరా సెలవులు బాగా క్యాష్ చేసుకుని అదరగొడుతోంది. భారీ వసూళ్లను సాధిస్తూ మేకర్స్ కు లాభాలు అందిస్తోంది.

అయితే దేవర మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారం రోజుల్లో రూ.405 కోట్ల గ్రాస్ వ‌సూళ్లను సాధించింది. అనంతరం వసూళ్లు కాస్త నెమ్మదించినా.. దసరా సెలవులు బాగా కలిసొచ్చాయి. తాజాగా 16 రోజుల్లో దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఇప్పుడు ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఇక దేవర.. రూ.500 కోట్ల వసూళ్లు రాబడుతుందని రిలీజ్ కు ముందే అంతా అంచనా వేశారు. ఇప్పుడు రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడంతో టార్గెట్ ఫినిష్ అయిందని చెబుతున్నారు. దసరా పూర్తయ్యేలోపు టార్గెట్ ఫినిష్ చేసుకోవడం సంతోషంగా ఉందని అంటున్నారు. తన కెరీర్ లో ఎన్టీఆర్ సోలో హీరోగా రూ.500 కోట్లు రాబట్టడం ఇదే మొదటిసారి. దీంతో ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఫుల్ రన్ లో దేవర ఇంకా మంచి వసూళ్లు సాధిస్తుందని అంటున్నారు.

అయితే దేవర రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను నిర్మాత నాగవంశీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తెలుగు స్టేట్స్ లో రూ.112.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దేవర మూవీ దిగినట్లు సమాచారం. కేవలం 10 రోజుల్లోనే టార్గెట్ ను పూర్తి చేసుకుందట. రూ.135 కోట్లకు పైగా సాధించేసిందని వినికిడి. బాలీవుడ్ లో కూడా ఊహించని రీతిలో దేవర వసూళ్లను రాబడుతోంది.

ఓవర్సీస్ సంగతి ఇక చెప్పనక్కర్లేదు. రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన దేవర.. విడుదల తర్వాత తనదైన శైలిలో సత్తా చాటుతోంది. నార్త్ అమెరికాలో 7 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసింది. యూకేలో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. అలా దేవరను కొనుగోలు చేసిన వారందరికీ లాభాలనే చెప్పాలి. ఇప్పుడు దేవర పార్ట్-2పై అందరి కళ్లూ పడ్డాయి. త్వరలోనే మూవీ పనులు స్టార్ట్ కానున్నాయి. మరి దేవర సీక్వెల్ ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News