దేవర బాక్సాఫీస్.. 2వ రోజు లెక్క ఎలా ఉందంటే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ పరంగా భారీ రెస్పాన్స్ వస్తోంది.

Update: 2024-09-29 05:46 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ పరంగా భారీ రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న ఈ చిత్రం, తెలుగు రాష్ట్రాల్లో కూడా 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ ఏడాది ఫస్ట్ డే సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఇదిలా ఉంటే, రెండో రోజైన శనివారం కూడా 'దేవర' సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభించింది. మొదటి రోజుతో పోల్చితే కొంత తగ్గినా, వసూళ్లు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఏరియాల వారీగా చూస్తే, నైజాంలో ‘దేవర’ మూవీ రెండో రోజు 6.94 కోట్ల షేర్ వసూలు చేసింది. సీడెడ్ లో 3.77 కోట్ల షేర్ రాబట్టగా, వైజాగ్ ఏరియాలో 1.68 కోట్ల షేర్ వసూలైంది. తూర్పు గోదావరిలో 86 లక్షలు, పశ్చిమ గోదావరిలో 48 లక్షలు, కృష్ణా జిల్లాలో 95 లక్షల షేర్ ‘దేవర’ కలెక్ట్ చేసింది. గుంటూరులో 82 లక్షలు, నెల్లూరులో 62 లక్షల షేర్ సాధించింది. మొత్తంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు 'దేవర' మూవీ 16.12 కోట్ల షేర్ వసూలు చేసింది.

రెండు రోజుల మొత్తం కలెక్షన్స్ చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 70.33 కోట్ల వరకు షేర్ రాబట్టింది. శనివారంతో పోల్చితే ఆదివారం కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 'దేవర' రెండు రోజుల్లో 250 నుండి 300 కోట్ల మధ్యలో వసూళ్లు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మూడు రోజుల్లో ‘దేవర’ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు సాధించడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. వీకెండ్ తర్వాత కూడా డీసెంట్ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. ‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, అనిరుద్ సంగీతం ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పొందాయి.

ఏరియా వారీగా రెండవ రోజు కలెక్షన్స్:

నైజాం: ₹6.94 కోట్లు

సీడెడ్: ₹3.77 కోట్లు

వైజాగ్: ₹1.68 కోట్లు

తూర్పు గోదావరి: ₹0.86 కోట్లు

పశ్చిమ గోదావరి: ₹0.48 కోట్లు

కృష్ణా: ₹0.95 కోట్లు

గుంటూరు: ₹0.82 కోట్లు

నెల్లూరు: ₹0.62 కోట్లు

సెకండ్ డే మొత్తం కలెక్షన్స్: ₹16.12 కోట్లు

మొత్తం రెండు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్:

నైజాం: ₹26.26 కోట్లు

సీడెడ్: ₹14.17 కోట్లు

వైజాగ్: ₹7.15 కోట్లు

తూర్పు గోదావరి: ₹4.88 కోట్లు

పశ్చిమ గోదావరి: ₹4.08 కోట్లు

కృష్ణా: ₹3.97 కోట్లు

గుంటూరు: ₹7.09 కోట్లు

నెల్లూరు: ₹2.73 కోట్లు

మొత్తం రెండు రోజుల కలెక్షన్: ₹70.33 కోట్లు

Tags:    

Similar News