జాన్వీ కపూర్ కిది గ్రాండ్ లాంచింగ్!
కానీ ఇవేవి జాన్వీ ఖాతాలో బ్లాక్ బస్టర్లగా కనిపించవు. తొలి రోజు వంద కోట్లు తెచ్చిన సినిమాల జాబితాలోనూ ఉండవు.
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కి `దేవర` ఇండియన్ బెస్ట్ లాంచింగ్ మూవీ అయిందా? మాతృభాష హిందీ ని మించి తెలుగులోనే అది సాధ్యమైందా? అంటే అవుననే అనిపిస్తుంది. జాన్వీ బాలీవుడ్ లో `ధడక్` తో చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత `గుంజన్ సక్సేనా`లో నటించింది. `రూహీ`, `గుడ్ లక్ జెర్రీ`, `మిలీ`, `బవాల్`, `ఉలజ్`, `మిస్టర్ అండ్ మిస్టర్స్ మహి` ఇలా కొన్ని సినిమాలు చేసింది.
కానీ ఇవేవి జాన్వీ ఖాతాలో బ్లాక్ బస్టర్లగా కనిపించవు. తొలి రోజు వంద కోట్లు తెచ్చిన సినిమాల జాబితాలోనూ ఉండవు. కానీ టాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన `దేవర` మాత్రం జాన్వీ కెరీర్ లోనే ఓ గొప్ప చిత్రంగా నిలిచి పోతుంది. ఈ సినిమా తొలి రోజు 170 కోట్ల వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఓపెనింగ్ జాన్వీ చూడాలంటే? అది ఇప్పట్లో జరిగేది కాదు. అక్కడ పెద్ద పెద్ద స్లార్లకే ఇంకా సాధ్యం కాలేదు.
అలాంటిది జాన్వీకి ఓ తెలుగు సినిమాతో ఈ గౌరవం దక్కడం ఆమె చేసుకున్న అదృష్టంగా చెప్పాలి. ఇది జాన్వీ మామ్ శ్రీదేవి అందించిన గిప్ట్ గా చెప్పాలి. శ్రీదేవి బ్రాండ్ తోనే జాన్వీకి ఈ అవకాశం వచ్చింది. లేదంటే పనిగట్టుకుని జాన్వీనే ఎందుకు తీసుకుంటారు. అలనాటి అందాల నటి శ్రీదేవికి తెలుగు సినిమాతో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే.
జాన్వీ ఆమె కుమార్తె అవ్వడం తో కొరటాల- ఎన్టీఆర్ జాన్వీ అయితే ది బెస్ట్ గా ఉంటుందని ఎంపిక చేసారు. ఇప్పుడా సినిమా సక్సెస్ తో జాన్వీకి మంచి గుర్తింపు దక్కుతుంది. ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోయినా వసూళ్ల పరంగా `దేవర` దూకుడుతో ఇది సాద్యమైంది. అయితే ఈసినిమా బాలీవుడ్ కి మాత్రం అంతగా కనెక్ట్ అవ్వలేదు.