ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తలపిస్తున్న లాస్ ఏంజిల్స్ థియేటర్..!

దేవర రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ లాస్ ఏంజిల్స్ లోని బియాండ్ ఫెస్ట్ లో పాల్గొన్నారు.

Update: 2024-09-27 15:45 GMT

దేవర రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ లాస్ ఏంజిల్స్ లోని బియాండ్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. అక్కడ ఈజిప్టియన్ థియేటర్ లో దేవర స్పెషల్ ప్రీమియర్ లో పాల్గొన్నారు. ఆ స్పెషల్ షో తర్వా ఎన్టీఆర్ కు అక్కడ ఉన్న ఆడియన్స్ అంతా కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారని తెలుస్తుంది. ఐతే ఈ వీడియోని షేర్ చేస్తూ ఇదొక అద్భుతమైన సందర్భం అని.. ఇలాంటి మూమెంట్ ని ఇచ్చినందుకు ప్రేక్షకులకు, బియాండ్ ఫెస్ట్ టీం కు తన ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో కామెంట్ పెట్టారు ఎన్టీఆర్.

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ లో నటించాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాలో ఎన్టీఆర్ నటన, యాక్షన్ అంతా ఫ్యాన్స్ కు ఫీస్ట్ అందిస్తుంది. కొరటాల శివ కథ కథనాలే ఆశించిన రేంజ్ అందుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ అవ్వడం రెండో భాగానికి లీడ్ తీసుకున్న విధానం కొంత అసంతృప్తిగా అనిపిస్తుంది.

ఐతే దేవర కోసం ఎన్టీఆర్ లాస్ ఏంజిల్స్ స్పెషల్ ప్రీమియర్ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో భాగంగా ఎన్టీఆర్ తెలుగు ఆడియన్స్ తో పాటుగా తనని అభిమానిస్తున్న ఫారిన్ ఆడియన్స్ ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఐతే లాస్ ఏంజిల్స్ లో ఉన్న ఆ థియేటర్ రెస్పాన్స్ చూస్తే అదేదో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మన తెలుగు ఆడియన్స్ చేసే హడావిడిలా అనిపించింది. తెలుగు సినిమా హీరో స్టామినా ఏంటన్నది పర దేశంలో కూడా చాటుతున్నారు మన స్టార్స్.

RRR తో ఎన్టీఆర్ కు గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన దేవర సినిమాపై అంతటా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దేవర సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వి కపూర్ నటించింది. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. అనిరుద్ రవిచందర్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రధాన అంశంగా మారింది. దేవర టాక్ ఐతే ఓకే ఓకే అనేలా ఉంది. మరి వసూళ్లు ఎలా ఉంటాయన్నది చూడాలి.

Tags:    

Similar News