దేవర రెండో ఆయుధం… అంచనాలకి మించి

ఒక వేళ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ ట్రైలర్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేయకుంటే మూవీ రిలీజ్ కి ముందు సెకండ్ ట్రైలర్ ని వదులుతున్నారు.

Update: 2024-09-16 23:30 GMT

పాన్ ఇండియా సినిమాలకి హైప్ క్రియేట్ చేయాలంటే అది సాంగ్స్, ట్రైలర్స్ తోనే సాధ్యం అవుతుంది. ట్రైలర్ బాగుంటే సినిమాపై ఆటోమేటిక్ గా అటెన్షన్ క్రియేట్ అవుతుంది. సినిమాకి ఎంత పబ్లిసిటీ చేసిన రాని హైప్ ఈ సాంగ్స్, ట్రైలర్స్ తో వస్తుందని సినీ విశ్లేషకులు చెప్పే మాట. ఇది నిజమేనని 'బాహుబలి' నుంచి రీసెంట్ గా వచ్చిన 'కల్కి 2898ఏడీ' సినిమా వరకు అన్ని ప్రూవ్ చేశాయి.

ఒక వేళ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ ట్రైలర్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేయకుంటే మూవీ రిలీజ్ కి ముందు సెకండ్ ట్రైలర్ ని వదులుతున్నారు. 'సలార్', 'కల్కి 2898ఏడీ' సినిమాలకి ఇలా రెండు ట్రైలర్స్ స్ట్రాటజీ వర్క్ అవుట్ అయ్యింది. ఈ సినిమాల ప్రమోషన్స్ లో ప్రభాస్ పెద్దగా పాల్గొనకపోయిన ట్రైలర్స్ తోనే మూవీపై ప్రేక్షకుల అటెన్షన్ పెరిగింది. అది ఈ సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపించింది.

ప్రమోషన్ లో మొదటి ఆయుధంగా 'దేవర' మూవీ ట్రైలర్ ని ఇప్పటికే లాంచ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ కి మిశ్రమ స్పందన వచ్చింది. ఎన్టీఆర్ అభిమానులని ట్రైలర్ అలరించిన సామాన్య ప్రేక్షకులకి మాత్రం పెద్దగా చేరువ కాలేదు. సినిమాలో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఏదో ఉందనే క్యూరియాసిటీని ట్రైలర్ క్రియేట్ చేయలేదనే మాట వినిపించింది. అలాగే గ్రాఫిక్స్ విషయంలో కూడా రకరకాల ట్రోల్స్ వచ్చాయి.

దీంతో 'దేవర' సెకండ్ ట్రైలర్ ని పర్ఫెక్ట్ గా రిలీజ్ చేసేందుకు కొరటాల శివ సిద్ధం అవుతున్నాడంట. ఇప్పటికే సెకండ్ ట్రైలర్ కట్ ని రెడీ చేశారని తెలుస్తోంది. దానిని మరోసారి ఫైనల్ గా చూసుకొని మాస్ అండ్ యాక్షన్ ఎలివేషన్ షాట్స్ తో పవర్ ఫుల్ గా రెడీ చేసి వదలబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. అయితే ఈ సెకండ్ ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది స్పష్టత లేదు. ప్రీరిలీజ్ ఈవెంట్ రోజు సెకండ్ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. మరి ఈ సెకండ్ ట్రైలర్ పబ్లిక్ లో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News