దేవర.. అప్పుడే రికార్డులు షురూ..
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్న మేకర్స్.. విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవర పార్ట్-1పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇటీవల షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్న మేకర్స్.. విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్, చుట్టమల్లె.. వేరే లెవెల్ లో రెస్పాన్స్ అందుకోగా.. రీసెంట్ గా దావూదీ పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అందుకు ముంబైలో స్పెషల్ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే సెప్టెంబర్ స్టార్టింగ్ లోనే యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. దీంతో ఓవర్సీస్ ఫ్యాన్స్.. టికెట్లు కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. టికెట్లు ఓపెన్ అయిన కొద్ది నిమిషాలకే అమ్ముడు పోతున్నాయి. అలా దేవర మూవీ.. ప్రీమియర్స్ షోలకు సంబంధించిన వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు యూఎస్ ప్రీ సేల్స్ లో ఐదు లక్షల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.4 కోట్లు) ను వసూలు చేసింది దేవర.
దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. దేవర మరిన్ని రికార్డులు క్రియేట్ చేయనుందని సినీ పండితులు చెబుతున్నారు. ప్రీమియర్ షో ప్రీ సేల్స్ తో దేవర పది లక్షల డాలర్లు (మిలియన్ డాలర్లు) రాబట్టే అవకాశముందని అంటున్నారు. యూఎస్ లో ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే భారీ వసూళ్లు వస్తుంటే.. ఇంకా ఇండియాలో స్టార్ట్ చేస్తే వేరే లెవెల్ కలెక్షన్స్ రాబట్టడం పక్కా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. దేవరలో తారక్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. బీ టౌన్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందుతున్న దేవర పార్ట్-1 ఎలా ఉంటుందో చూడాలి.