దేవ‌ర మూవీ టిక్కెట్ రేట్లు పెంపు... ఏపీ - తెలంగాణ‌లో ఎలా అంటే...!

ఇదిలా ఉంటే భారీ బ‌డ్జెట్ సినిమా కావ‌డంతో ఇప్పుడున్న టిక్కెట్ రేట్లు పెంచుకుంటే త‌ప్పా భారీగా రిక‌వ‌రీ ఉండ‌దు.

Update: 2024-09-14 12:26 GMT

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర సినిమా ఈ నెల 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఐదు భాష‌ల‌లో రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్ న‌టించిన త్రిబుల్ ఆర్ సినిమా వ‌చ్చి కూడా రెండున్న‌రేళ్లు దాటుతోంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు మాత్ర‌మే కాదు.. నంద‌మూరి ఫ్యాన్స్‌... టాలీవుడ్ సినీ జ‌నాలు అంద‌రూ ఎన్టీఆర్‌ను ఎప్పుడెప్పుడు తెర‌మీద చూస్తామా ? అని ఒక్క‌టే ఉత్కంఠ‌తో ఉన్నారు. రు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్ కూడా రిలీజ్ కాకుండానే నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ ద్వారానే ఏకంగా 1 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టేసింది.

ఇదిలా ఉంటే భారీ బ‌డ్జెట్ సినిమా కావ‌డంతో ఇప్పుడున్న టిక్కెట్ రేట్లు పెంచుకుంటే త‌ప్పా భారీగా రిక‌వ‌రీ ఉండ‌దు. సినిమాకు ఎంత హిట్ టాక్ ఉన్నా సినిమాకు జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్ నేప‌థ్యంలో అన్ని ఏరియాల్లోనూ టార్గెట్లు భారీగా ఉన్నాయి. ఏపీలో సీడెడ్ కాకుండానే మిగిలిన ఏరియాల‌కు రు. 55 కోట్ల‌కు అమ్మిన‌ట్టుగా తెలుస్తోంది. నైజాంలోనూ దేవ‌ర టార్గెట్ రు. 50 కోట్ల రేంజ్‌లో ఉందంటున్నారు. ఈ మేర షేర్ రాబ‌ట్టాలి అంటే.. గ్రాస్ ఇంచా చాలా ఎక్కువుగా ఉండాలి.

అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వాల అనుమ‌తితో టిక్కెట్ రేట్లు పెంచుకుంటున్నారు. తెలంగాణ‌లో మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లో రు. 413 - సింగిల్ స్క్రీన్ ల‌లో రు. 250... ఏపీలో మ‌ల్టీఫ్లెక్స్ ల‌లో రు. 325... సింగిల్ స్క్రీన్‌ల‌లో రు. 200 పెంచుకునేందుకు అనుమ‌తులు వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. ఇటీవ‌ల క‌ల్కి సినిమాకు కూడా భారీగా టిక్కెట్ రేట్లు పెంచుకున్నారు. అందుకే క‌ల్కి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌సూళ్లు సాధించింది.

ఇక దేవ‌ర విష‌యానికి వ‌స్తే నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌, మిక్కిలినేని సుధాక‌ర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌. సైఫ్ ఆలీఖాన్‌, బాబీడియోల్ విల‌న్లు కాగా.. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News