దేవరకు ఇది ప్లస్సా.. మైనస్సా..?

ఈ నెల 27న రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ దేవర సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

Update: 2024-09-13 08:30 GMT

ఈ నెల 27న రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ దేవర సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ట్రైలర్ ఈమధ్యనే ముంబైలో చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా తారక్ మరోసారి సినిమాపై తనకున్న కాన్ఫిడెన్స్ ని పంచుకున్నాడు. సినిమా చివరి 30, 40 మినిట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అన్నాడు. ఆమధ్య ఓ సినిమా ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ దేవర ప్రతి ఫ్యాన్ ని కాలర్ ఎగరేసేలా చేస్తుందని అన్నాడు. తారక్ ఇలా తన సినిమా గురించి చెప్పడం ఫ్యాన్స్ కి రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది.

ఐతే దేవర సినిమా ట్రైలర్ చూశాక కొంతమంది ఆడియన్స్ మాత్రం సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది రెగ్యులర్ స్టోరీ లానే ఉందని అంటున్నారు. మరికొందరు సినిమా స్టోరీ మొత్తం ట్రైలర్ లో చెప్పారని అంటున్నారు. అసలే ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ ఆ తర్వాత చేస్తున్న సినిమా కథ విషయంలో మరీ రొటీన్ గా వెళ్లాడని చెప్పుకుంటున్నారు.

సూపర్ హిట్ సినిమాల ఫార్మెట్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి కొత్త కథతో అద్భుతమైన సెటప్ చేస్తారు. రెండోది కథ కాస్త పాతగా అనిపించినా క్యారెక్టరైజేషన్ తో కొత్తగా మెప్పిస్తారు. ఐతే దేవర సినిమా కథ రొటీన్ గానే అనిపిస్తుంది. పాత్రలు వాటి స్వభావాలు ప్రేక్షకులను మెప్పిస్తే సినిమా అదరగొడుతుంది. ఐతే దేవర మీద ట్రైలర్ రిలీజ్ ముందు వరకు తారాస్థాయి అంచనాలు ఉండగా ట్రైలర్ తర్వాత ఆ ఎక్స్ పెక్టేషన్స్ తగ్గాయి.

ఐతే ఇది సినిమాకు ప్లస్ అవుతుందని కొందరు అంటున్నారు. భారీ అంచనాలతో వెళ్తే అక్కడ ఎంత మంచి సినిమా తీసినా ఆడియన్స్ ఓకే అనే ఛాన్స్ ఉండదు. అదే కాస్త తక్కువ అంచనాలతో వెళ్లి యావరేజ్ కంటెంట్ ఉన్నా సరే అదిరిపోయిందని అంటారు. అలా ఎన్టీఆర్ దేవర సినిమా కూడా అంచనాలు తగ్గించి మంచి పనిచేశారని అంటున్నారు. ఐతే సినిమాలో ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో ఫ్యాన్స్ కి పక్కా మాస్ ట్రీట్ అందిస్తుందని అనిపిస్తుంది. సెప్టెంబర్ 27న ఫ్యాన్స్ కి మంచి ఐ ఫీస్ట్ అందించేందుకు తారక్ వస్తున్నాడు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News