'దేవ‌ర'కి ఆ హాలీవుడ్ సినిమా నుంచి థ్రెట్!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న `దేవ‌ర` మొద‌టి భాగం రిలీజ్ డేట్ పాన్ ఇండియాలో ఫిక్సైన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-08-30 06:07 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న `దేవ‌ర` మొద‌టి భాగం రిలీజ్ డేట్ పాన్ ఇండియాలో ఫిక్సైన సంగ‌తి తెలిసిందే. సెప్టెంబ‌ర్ 27న చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత తార‌క్ నుంచి భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న సినిమా ఇదే. తెలుగు స‌హా క‌న్న‌డ‌లో తార‌క్ ఇమేజ్ కి తిరుగు లేదు. తార‌క్ ఇమేజ్..కొర‌టాల సెన్సిబిలిటీ వ‌ర్కౌట్ అయిందంటే వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ షేక్ అవుతుంది.

అందులో ఎలాంటి డౌట్ లేదు. హిందీలో సైతం ఇదే దూకుడుతో మార్కెట్ లోకి వ‌స్తోంది. ఇప్ప‌టికే భారీ ఎత్తున అన్ని భాష‌ల్లోనూ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇంత‌వ‌ర‌కూ దేవ‌ర సేఫ్. అయితే నార్త్ నుంచి దేవ‌ర‌కి గ‌ట్టి పోటీ ఎదుర‌య్యే అవ‌కాశం క‌నిపిస్తుంది. అక్టోబ‌ర్ 4న హాలీవుడ్ చిత్రం `జోక‌ర్ -2` కూడా భారీ అంచ‌నాల మధ్య రిలీజ్ అవుతుంది. `జోక‌ర్` ప్రాంచైజీ కి ఇండియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.

మొద‌టి భాగం జోక‌ర్ ఇండియ‌న్ బాక్సాఫీస్ ని వ‌సూళ్ల‌తో షేక్ చేసింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా సంచ‌ల‌న వ‌సూళ్లు సాధించింది. 2019 లోనే జోక‌ర్ 70 కోట్ల వ‌సూళ్లు ఇండియా మార్కెట్ నుంచి రాబ‌ట్టింది. అప్ప‌టి నుంచి నార్త్ ఆడియ‌న్స్ లో జోక‌ర్ ఓ బ్రాండ్ గా మారింది. ఈనేప‌థ్యంలో ఇండియాన్ బాక్సాఫీస్ వ‌ద్ద జోకర్ -2 టార్గెట్ 150 కోట్ల‌పైనే ఉంటుంది.

అదే టార్గెట్ గా ఇండియాలో రిలీజ్ ప్లాన్ చేసి దిగుతున్నారు. దీంతో ఈ ప్ర‌భావం దేవ‌ర‌పై ఉంటుంద‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే అప్ప‌టికే దేవర రిలీజ్ అయి వారం స‌మీపిస్తుంది. ఈ లోపు ఆ సినిమా కి మంచి టాక్ వ‌స్తే రాబ‌ట్టాల్సిన వ‌సూళ్లు రాబ‌డుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక‌వేళ జోక‌ర్-2 హిట్ టాక్ తెచ్చుకుంటే గ‌నుక దేవ‌ర వసూళ్లు పై కొంత‌ ప్ర‌భావం ప‌డుతుంది.

Tags:    

Similar News