అటు ఇటు తిరిగి.. చరణ్ vs తారక్?

టాలీవుడ్ లో సినిమాల విడుదల తేదీలు మారడం ఇతర సినిమాలను ఇబ్బంది కలిగిస్తోంది. గత ఏడాది సలార్ విషయంలో ఇదే జరిగింది.

Update: 2024-01-24 07:53 GMT

టాలీవుడ్ లో సినిమాల విడుదల తేదీలు మారడం ఇతర సినిమాలను ఇబ్బంది కలిగిస్తోంది. గత ఏడాది సలార్ విషయంలో ఇదే జరిగింది. సలార్ చివరి నిమిషంలో వాయిదా పడడంతో చాలా సినిమాలకు ఇబ్బందులు వచ్చాయి. ఇక ఈ ఏడాది కూడా అదే జరగబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'దేవర' రిలీజ్ ఏప్రిల్ 5 నుంచి సెప్టెంబర్ నెలకి వాయిదా పడింది.

దేవర రిలీజ్ టైం లో ఏపీలో ఎలక్షన్స్ ఉండడం, సినిమా విఎఫ్ఎక్స్ పనులు ఇంకా బ్యాలెన్స్ ఉండడం, సైఫ్ అలీ ఖాన్ గాయపడటం.. వంటి కారణాలు వాయిదాకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఇక దేవర వాయిదా రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' కి క్లాష్ అయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు టాక్ మొదలైంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ 'గేమ్ చేంజర్' మూవీని ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక దేవర జూన్ లో కుదరకపోతే ఆగస్టు లేదా సెప్టెంబర్ ను టార్గెట్ గా పెట్టుకునే ఛాన్స్ ఉంది. మధ్యలో పుష్ప 2 కూడా ఉంది. బన్నీ కూడా వెళ్లే ఛాన్సులు ఉన్నాయి కానీ వాళ్ళు ముందే కర్చీఫ్ వేశారు కావున ఒకవేళ అనుకున్న టైమ్ కు వస్తే పోటీగా ఎవరు ఉండకపోవచ్చు. అటు తిరిగి ఇటు తిరిగి.. 'దేవర' Vs 'గేమ్ చేంజర్' మధ్య భారీ క్లాష్ ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయాలు వస్తున్నాయి.

ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్నాయి. సాధారణంగా రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపించరు. మాక్సిమం ఒకేరోజు రిలీజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఆ సమయానికి పరిస్థితులు సహకరించకపోతే కష్టమే.

కనీసం ఒక వారం గ్యాప్ ఉండేలా చూసుకున్నా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఒకవేళ ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడితే ఈ క్లాష్ కాస్త మెగా, నందమూరి అభిమానుల మధ్య దూరం పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్మాతలు ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తే బాగుంటుంది.

అసలే 'గేమ్ చేంజర్' చాలాకాలంగా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు దసరాకు రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అలాంటిది ఇప్పుడు దేవర పోటీగా వస్తే ఎలా చర్చిస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ కు దిల్ రాజుకు మంచి బాండింగ్ ఉంది. కాబట్టి తప్పకుండా క్లాష్ ఉండకుండానే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.




Tags:    

Similar News