'దేవర' గ్లింప్స్ లో ఇంగ్లీష్ సౌండ్.. అర్ధం ఏంటంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న 'దేవర' సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

Update: 2024-01-08 13:04 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న 'దేవర' సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ రేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కొరటాల శివ ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారు. సినిమా ఎక్కువ భాగం సముద్రంలోనే ఉండడంతో ఇందుకోసం భారీ గ్రాఫిక్స్, VFX షాట్స్ ని ఉపయోగించబోతున్నారు.

అంతేకాదు హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. భారీ విజువల్స్, యాక్షన్ షాట్స్ తో ఈ గ్లింప్స్ ని కట్ చేస్తే దానికి అనిరుద్ ఇచ్చిన బీజీయం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి.

నిజానికి దేవర గ్లింప్స్ రాబోతుందనే విషయం బయటకు వచ్చినప్పటి నుంచి చాలామంది గ్లింప్స్ కోసం కాకుండా అనిరుద్ బీజీయం ఈ రేంజ్ లో ఉంటుందోనని అందరూ మాట్లాడుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా గ్లింప్స్ వీడియో కి ఇంగ్లీష్ లిరిక్స్ తో బీజీయం క్రియేట్ చేసి మెస్మరైజ్ చేశాడు.

ఇంతకీ ఆ ఇంగ్లీష్ లిరిక్స్ కి అర్థం ఏంటంటే, "నువ్వు ఎప్పుడూ సముద్రాన్ని తాకలేదు. నువ్వు ఎప్పుడూ నాతో ఆడలేదు. నేను ఎప్పుడూ నీ పైన దయ చూపించను. నిన్ను నేను బ్రతకనివ్వను. నీ రక్తాన్ని ఏరులై పారిస్తాను" అని అర్థం వచ్చేలా ఆ ఇంగ్లీష్ లిరిక్స్ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే సినిమాలో ఎన్టీఆర్, తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. అంతేకాదు లిరిక్స్ అర్థాన్ని బట్టి తనకు దూరంగా ఉన్న తండ్రి గురించి మాట్లాడుతున్నట్లు ఉన్నాయి.

ఇక గ్లింప్స్ మొత్తాన్ని ఇంగ్లీష్ లిరిక్స్ తోనే నడిపిస్తూ చివర్లో ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు.' ఈ సముద్రం చేపలు కంటే కత్తులని, నెత్తురుని ఎక్కువ చూసుండాది. అందుకేనేమో దీనిని ఎర్ర సముద్రం అన్నారు" అంటూ తారక్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించింది. గ్లింప్స్ వీడియో తోనే మేకర్స్ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ పెంచేశారు. రెండు భాగాలుగా రాబోతున్న దేవర పార్ట్-1 ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Tags:    

Similar News