'దేవర' VFX తోనే తిర‌కాసు..!

ప్రేక్ష‌కుల‌కు భారీ విజువ‌ల్ ట్రీట్ ని అందించాలనుకుంటున్నందున విజువల్స్ విషయంలో రాజీ పడకూడదని చిత్రనిర్మాతలు భావిస్తున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి.

Update: 2024-01-29 18:39 GMT

జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' 2024 ద్వితీయార్థంలో థియేటర్లలోకి రానుందని ఇటీవ‌ల‌ ప్రచారం జరుగుతోంది. VFX వర్క్ కారణంగా, నిర్మాణానంతర పనులు అనుకున్న సమయానికి ముగియకపోవచ్చని మేకర్స్ ఇప్పుడు సినిమాను వాయిదా వేయాలని చూస్తున్నారంటూ ప్ర‌చార‌మ‌వుతోంది. వాస్త‌వానికి ఏప్రిల్ 4న ఈ మూవీ రిలీజ‌వుతుంద‌ని ప్ర‌క‌టించారు. కానీ అప్ప‌టికి ప‌నులు స‌జావుగా పూర్త‌వుతాయా లేదా? అంటూ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న సాగుతున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం రిలీజ్ కోసం స‌ర్వ‌స‌న్నాహ‌కాలు చేస్తున్నారు.

అయితే దేవ‌ర‌లో VFX హై-ఎండ్ లో ఉంటుంద‌ని స‌మాచారం. ఔట్‌పుట్ ఊహించిన దాని కంటే ఎక్కువ సమయం తీసుకుంటోంది. ప్రేక్ష‌కుల‌కు భారీ విజువ‌ల్ ట్రీట్ ని అందించాలనుకుంటున్నందున విజువల్స్ విషయంలో రాజీ పడకూడదని చిత్రనిర్మాతలు భావిస్తున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. ప్ర‌స్తుతం దేవ‌ర వీఎఫ్ ఎక్స్ కోసం ఆరు విభిన్న కంపెనీలు ప‌ని చేస్తున్నాయ‌ని తెలుస్తోంది. స్థానిక కంపెనీల‌తో పాటు జాతీయ అంత‌ర్జాతీయ‌ స్థాయిలో గుర్తింపు ఉన్న వీఎఫ్ ఎక్స్ కంపెనీలు ప‌ని చేస్తున్నాయ‌ని స‌మాచారం.

సైఫ్ అలీ ఖాన్ అనూహ్య గాయం వల్ల సినిమా ఆలస్యం అవుతుందనే పుకార్లు నెట్‌లో వైర‌ల్ అవుతున్నా అది నిజం కాద‌ని తెలుస్తోంది. కేవలం వీఎఫ్‌ఎక్స్ వర్క్ కారణంగానే జాప్యం జరుగుతోందని, సైఫ్‌ అలీఖాన్‌కు గాయం కావడానికి సంబంధం లేదని యూనిట్ వ‌ర్గాలు ఇదివ‌ర‌కే స్పష్టం చేశారు. సైఫ్‌ ఇప్పటికే ఈ చిత్రంలోని తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశాడని తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జనవరి 8న విడుదల చేయ‌గా అద్భుత స్పంద‌న వ‌చ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ జంట‌గా న‌టించారు. దాదాపు 140 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంద‌ని స‌మాచాం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


Tags:    

Similar News