దేవర 2.. 2026 ఫిక్స్ అవ్వొచ్చా..?
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నట్టు అర్థమవుతుంది. యువ సుధ ప్రొడక్షన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నట్టు అర్థమవుతుంది. యువ సుధ ప్రొడక్షన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ తోనే అవుట్ పుట్ అదిరిపోతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు సినిమాలో ఎన్టీఆర్ పాత్ర నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని టాక్. అందుకే దేవర ఒక సినిమాగా చెప్పే కథ కాదు రెండు భాగాలు కావాల్సిందే అని డిసైడ్ అయ్యారు. దర్శకుడు కొరటాల శివ దేవర రెండు భాగాలని చెప్పి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు.
ఇదిలా ఉంటే దేవర 1 ఏప్రిల్ 5, 2024 రిలీజ్ కన్ ఫర్మ్ చేయగా దేవర 2 రిలీజ్ ఎప్పుడు అన్నది ఫ్యాన్స్ టెన్షన్ పెట్టుకున్నారు. దేవర 1 తర్వాత నెక్స్ట్ ఇయర్ లోనే ఎన్టీఆర్ వేరే రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. హృతిక్ రోషన్ తో వార్ 2.. ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ ఈ రెండు ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా ఉన్నాయి. వార్ 2 ఆరు నెలల్లో పూర్తి చేసే అవకాశం ఉన్నా ప్రశాంత్ నీల్ సినిమా మాత్రం అంత ఈజీగా అయ్యేది కాదు.
ప్రశాంత్ నీల్ సినిమా మొదలు పెడితే అది పూర్తి చేసే దాకా దానికే టైం కేటాయించాల్సి ఉంటుంది. ఈలోగా మరో సినిమా చేసే అవకాశం లేదు. సో అలా చూస్తే దేవర 2 2025 చివర కూడా కష్టమే 2026 లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఎంత ప్రయత్నించినా సరే అనుకున్న టైం కు షూటింగ్ జరగడం, పొస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగడం లాంటివి కుదరాల్సి ఉంటుంది. సో అందుకే దేవర 2 కోసం మరో 3 ఏళ్లు వెయిట్ చేయక తప్పదు.
దేవర 1 సెన్సేషనల్ హిట్ అయితే దేవర 2 గురించి ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ఎక్కువ అవుతుంది. అల్లు అర్జున్ పుష్ప 1 కూడా 2021 లో వచ్చింది. ఆ సినిమా సెకండ్ పార్ట్ 2024 ఆగష్టు లో అంటున్నారు. సో క్యారెక్టర్ ఆడియన్స్ మైండ్ లో రిజిస్టర్ చేసేలా ఉంటే ఈ గ్యాప్ పెద్ద లెక్కేమి కాదు. పుష్ప 2 మీద బజ్ ఎలా ఉందో ఈమధ్య వచ్చిన పోస్టర్, టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసే అర్థం చేసుకోవచ్చు. అలా దేవర పాత్రని కూడా కొరటాల ఆడియన్స్ లో గుర్తుండిపోయేలా చేస్తే దేవర 2 కోసం రెండేళ్లు కాదు ఎన్నేళ్లయినా ఎదురుచూస్తారు.