దేవర గూస్ బంప్స్ అప్డేట్..!

ఇక ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేస్తున్నారని తెలుస్తుంది. దేవర సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడని తెలిసిందే

Update: 2024-01-08 11:49 GMT

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవర. ఆల్రెడీ ఈ కాంబోలో జనతా గ్యారేజ్ హిట్ అందుకోగా మరోసారి ఈ ఇద్దరు కలిసి దేవర చేస్తున్నారు. యువ సుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న దేవర సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. దేవర సినిమా ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. తారక్ ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.

ఇక ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేస్తున్నారని తెలుస్తుంది. దేవర సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడని తెలిసిందే. ఎన్.టి.ఆర్, సైఫ్ ల మధ్య భారీ యాక్షన్ సీన్ ఈ సెట్ లో షూట్ చేస్తారట. ఈ షెడ్యూల్ సినిమాకు చాలా కీలకమని తెలుస్తుంది. సినిమాలో హైలెట్ గా చెప్పుకునే సీన్స్ లో ఇది ఒకటని అంటున్నారు. సినిమాలో సైఫ్ విలనిజం కూడా ఒక రేంజ్ లో డిజైన్ చేశాడట కొరటాల శివ. ఎన్.టి.ఆర్, సైఫ్ ఇద్దరి మధ్య యాక్షన్ సీన్స్ యాక్షన్ లవర్స్ కి ఫుల్ మీల్స్ అందించేలా ఉంటాయని చెబుతున్నారు.

దేవరలో ఎన్.టి.ఆర్ లుక్ డిఫరెంట్ గా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ యాక్షన్ సీన్ కోసం తారక్ లుక్ అదిరిపోతుందని అంటున్నారు. ఫ్యాన్స్ అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తుంది. దేవర విషయంలో అప్డేట్స్ గురించి ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఉన్నారు. ఎన్.టి.ఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సినిమా కథ కథనాల పరంగా మ్యూజిక్ విషయంలో కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెబుతున్నారు. ఎన్.టి.ఆర్ దేవర సినిమా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందని సినిమాలో తారక్ నటనకు ఫ్యాన్స్ అంతా ఖుషి అవ్వడం పక్కా అని అంటున్నారు. ఎన్.టి.ఆర్ దేవర మొదటి పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేశారు. సినిమా నుంచి ప్రతి అప్డేట్ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. తప్పకుండా ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ స్టామినాను ప్రూవ్ చేసేలా దేవర ఉంటుందని చెప్పొచ్చు. దేవర తో పాటుగా ఎన్.టి.ఆర్ ఈ ఇయర్ వార్ 2 లో కూడా చేస్తున్నాడు. హృతిక్ రోషన్ తో ఢీ కొట్టబోతున్న తారక్ వార్ 2లో నెగిటివ్ రోల్ లో సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు.

Tags:    

Similar News