దేవర: దిల్ రాజు వదిలేస్తే.. వారికే..

యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రానున్న దేవర పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి

Update: 2024-01-22 04:09 GMT

యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రానున్న దేవర పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ బిజినెస్ కూడా గట్టిగా చేసే ఛాన్స్ ఉంది. సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి రాబోతున్న మూవీ కావడం తో అభిమానులు ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా బిజినెస్ డీల్స్ మొదలయ్యాయి.

తాజాగా మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేసి అంచనాలు అమాంతం పెంచేశారు. ఓటీటీ డీల్స్ అయితే ఫైనల్ అయిపోయినట్లు తెలుస్తోంది. అలాగే ఓవర్సీస్ లో కూడా భారీ ధరకి దేవర రైట్స్ కొనడానికి డిస్టిబ్యూటర్స్ సిద్ధంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ రైట్స్ కోసం దిల్ రాజు పోటీ పడుతున్నారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ కూడా దేవర రైట్స్ ని వదులుకోవడానికి సిద్ధంగా లేదనే మాట వినిపిస్తోంది.

ఒక వేళ దిల్ రాజు డీల్ సెట్టవ్వక వదులుకుంటే మాత్రం మైత్రి వాళ్ళు వెంటనే కొనేయడానికి సిద్ధంగా ఉన్నారంట. తాజాగా హనుమాన్ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ భారీ లాభాలు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దేవరతో కూడా అంతకు మించి సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నారు. నిర్మాతలు అయితే తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ రైట్స్ కోసం 100 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని టాక్.

ఒక్క ఆర్ఆర్ఆర్ తప్ప ఎన్ఠీఆర్ సినిమాలేవీ కూడా తెలుగు రాష్ట్రాలలో వంద కోట్ల బిజినెస్ చేయలేదు. అయితే ఆర్ఆర్ఆర్ తీసుకొచ్చిన హైప్, దేవర మీద ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ తో నిర్మాతలు ఈ స్థాయిలో తెలుగు రాష్ట్రాల కోసం డిమాండ్ చేస్తున్నారు. మైత్రీ నిర్మాతలు అయితే దీనిపై ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ అంటే కాస్తా ఎన్నికల సందడి ఏపీలో మొదలవుతుంది.

మార్చి ఆఖరు నుంచి ఐపీఎల్ సీజన్ కూడా మొదలవుతుంది. ఇది మే వరకు ఉంటుంది. ఈ టైంలో ముఖ్యంగా ఈవెనింగ్ షోలకి క్రికెట్ మ్యాచ్ ల వలన ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారంట. అందుకే రిలీజ్ డేట్ పై మరోసారి ఆలోచించే అవకాశం ఉంది. ఇక ఈ నెలాఖరు లోపు దేవర తెలుగు రాష్ట్రాలకి సంబందించిన డీల్స్ అయితే ఫైనల్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News