దేవర.. అన్ని అనుకున్నట్లు జరిగుంటే..

ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని ఎనౌన్స్ చేశారు. అయితే మధ్యలో సైఫ్ అలీఖాన్ గాయపడటంతో రోజులు షూటింగ్ కి గ్యాప్ వచ్చింది.

Update: 2024-04-05 04:14 GMT

అన్ని అనుకూలంగా జరిగి ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తోన్న దేవర మూవీ ఈ రోజు ప్రీమియర్ షోల ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చేది. ఇక యంగ్ టైగర్ సినిమా అంటే ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్ని థియేటర్స్ దగ్గర ఫుల్ హడావిడి కనిపించేది. అలాగే ఎన్టీఆర్ కటౌట్స్ థియేటర్స్ అన్ని నిండిపోయేవి.

తారకరాముడి సినిమా కోసం ఫ్యాన్స్ ఆకలితో ఎదురుచూస్తున్నారు. ఆయన సోలోగా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఐదేళ్లు అయిపోతుంది. ఆర్ఆర్ఆర్ మూవీతో థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అయితే ఈ సినిమా క్రెడిట్ మొత్తం రాజమౌళికి వెళ్ళిపోయింది. దీంతో సోలోగా పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ కొట్టే పనిలో తారక్ ఉన్నాడు. దానికోసం కొరటాల శివ లాంటి సాఫ్ట్ డైరెక్టర్ తో దేవర లాంటి కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ కథ సిద్ధం చేయించి సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు.

ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని ఎనౌన్స్ చేశారు. అయితే మధ్యలో సైఫ్ అలీఖాన్ గాయపడటంతో రోజులు షూటింగ్ కి గ్యాప్ వచ్చింది. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఇంకా పూర్తి కాలేదు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ కారణాలని దృష్టిలో ఉంచుకొని కొరటాల శివ రిలీజ్ డేట్ ని అక్టోబర్ కి మార్చేశారు. దీంతో ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది.

అయితే దేవర రిలీజ్ డేట్ ని ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీతో దిల్ రాజు ఉపయోగించుకుంటున్నారు. వేసవి సెలవుల తర్వాత ఏప్రిల్ మొదటి శుక్రవారం రావడం. అలాగే రంజాన్, ఉగాది, శ్రీరామనవమి వంటి సెలవులు కూడా వరుసగా కలిసిరావడంతో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చేవి. అయితే ఇప్పుడు ఆ అదృష్టం దేవర సినిమా కోల్పోయింది. ఆ ఛాన్స్ ని ఫ్యామిలీ స్టార్ దక్కించుకుంది.

అయిన కానీ దేవర మూవీపై దేశ వ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉంది. కచ్చితంగా తారక్ కెరియర్ లో దేవర బెస్ట్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. అక్టోబర్ నెలలో దసరాకి రాబోతున్న ఈ సినిమాతో భాక్సాఫీస్ రికార్డులు సృష్టించడం ఖాయం అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

Tags:    

Similar News