జాన్వీ-తారక్ మధ్య రొమాన్స్ కోసం స్పెషల్ సెట్!
ఇందులో తారక్-జాన్వీలపై రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించనున్నారుట. ఇది సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం 'దేవర' షూటింగ్ శర వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ పట్టాలెక్కించిన నాటి నుంచి ఎక్కడా గ్యాప్ తీసుకో కుండా పనిచేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, గోవా, కర్ణాటక, వైజాగ్ లాంటి ప్రదేశాల్లో కీలక షెడ్యూళ్లను పూర్తి చేసారు. దీనిలో భాగంగా మేజర్ పార్ట్ షూట్ అంతా యాక్షన్ సన్నివేశాలపైనే దృష్టి పెట్టి పనిచేసింది.
యాక్షన్ తో పాటు టాకీ పార్ట్ కూడా షూట్ చేసారు. ఇటీవలే థాయ్ లాండ్ లో ఓ పాటకి సంబంధించిన షూట్ పూర్తయింది. అవసరం మేర కొన్ని కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరించారు. తాజాగా వచ్చే వారం నుంచి హైదరాబాద్ లో యధావిధిగా షూటింగ్ పున ప్రారంభమవుతుంది. దీనిలో భాగంగా ఓ ప్రత్యేకమైన సెట్ ని సిద్దం చేస్తున్నారుట. అయితే ఈ సెట్‌ని ఓ రొమాంటిక్ సాంగ్ కోసం సిద్దం చేస్తున్నారుట.
ఇందులో తారక్-జాన్వీలపై రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించనున్నారుట. ఇది సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. పాట కూడా అంతే రొమాంటిక్ గా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మునుపెన్నడు చూడని కొత్త తారక్ ని పాటలో చూస్తారని అంటున్నారు. జాన్వీని పాటలో రొమాంటిక్ గా హైలైట్ అంతే హైలైట్ చేస్తున్నారుట. ఇంత వరకూ బాలీవుడ్ లో కూడా ఇలాంటి రొమాంటిక్ సాంగ్ చేయలేదంటున్నారు.
అభిమానుల కోసమే ప్రత్యేకంగా పాటని హైలైట్ చేస్తున్నట్లు చిత్ర వర్గాల నుంచి లీకులందుతున్నాయి. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్- అందాల శ్రీదేవి మధ్య చిత్రీకరించిన 'ఆకు చాటున పిందె తడిసే' రేంజ్ లోనే పాట ఉంటుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అదే నిజమైతే థియేటర్లు దద్దరిల్లిపోతాయి.