దేవర.. నైజాంలో ఆ స్థాయిలో డిమాండ్ ఉందా?

ఇందులో భాగంగా నైజాంలోనే ఏకంగా 50 కోట్లు కావాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారంట. ఆర్ఆర్ఆర్ సినిమాకి వచ్చిన హైప్, బిజినెస్ లెక్కలు దృష్టిలో ఉంచుకొని ఈ స్థాయిలో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-01-13 04:53 GMT

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవర. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. రీసెంట్ గా వచ్చిన దేవర గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ కెరియర్ లో దేవర బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో సిద్ధమవుతోంది.

ఎర్రసముద్రం నేపథ్యంలో కథ ఉంటుందని గ్లింప్స్ తో స్పష్టం అయ్యింది. ఇక ఈ సినిమాని ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి రాబోయే సినిమా ఇదే కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ పీక్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటి నుంచి ఈ సినిమా బిజినెస్ మీద నిర్మాత ఫోకస్ చేశారు. తారక్ ఇమేజ్, పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని ఏరియా వైజ్ గా ధరలు కోట్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా నైజాంలోనే ఏకంగా 50 కోట్లు కావాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారంట. ఆర్ఆర్ఆర్ సినిమాకి వచ్చిన హైప్, బిజినెస్ లెక్కలు దృష్టిలో ఉంచుకొని ఈ స్థాయిలో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 50 కోట్లు అంటే ఓ విధంగా చాలా పెద్ద మొత్తం అని చెప్పాలి. అయితే ఎన్టీఆర్ కి ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉంది. దాంతో పాటు దేవర సినిమాపై భారీ హైప్ ఉంది.

మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. ఈ కారణంగానే 50 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. నైజాం అంటే ఎక్కువగా దిల్ రాజు, మైత్రీ, ఏషియన్ పేర్లు వినిపిస్తూ ఉంటాయి. వారు మార్కెట్ లెక్కలు కరెక్ట్ గా అంచనా వేసి సినిమాని కొంటారు. ముందు సినిమా హిట్ అయ్యిందని నెక్స్ట్ మూవీపైన భారీగా పెట్టుబడులు పెట్టే సాహసం చేయలేరు.

మరి దేవర కోసం డిమాండ్ చేస్తోన్న 50 కోట్లు ఎవరైనా ఇచ్చి నైజాం రైట్స్ సొంతం చేసుకుంటారా లేదా అనేది చూడాలి. దేవర కంప్లీట్ అయిన వెంటనే ఎన్ఠీఆర్ వార్ 2 మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. హిందీలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తారక్ తో పాటు హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. తారక్ క్యారెక్టర్ మూవీలో నెగిటివ్ టచ్ తో ఉంటుందని టాక్.

Tags:    

Similar News