'దేవర' రిలీజ్ డేట్‌ గందరగోళం... కారణాలు ఇవే!

ఇప్పటి వరకు సినిమా నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. విడుదల వాయిదా ఉంటుందని కూడా ఎలాంటి లీక్స్ లేవు.

Update: 2024-01-22 11:30 GMT

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్‌ గా మారిన ఎన్టీఆర్‌ ప్రస్తుతం చేస్తున్న చిత్రం 'దేవర్‌'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ విడుదల తేదీని ఇప్పటికే ఏప్రిల్‌ 5 గా నిర్ణయించడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా ఆ తేదీకి సినిమా వచ్చేనా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటి వరకు సినిమా నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. విడుదల వాయిదా ఉంటుందని కూడా ఎలాంటి లీక్స్ లేవు. అయినా కూడా కొందరు మీడియా వారు విడుదల తేదీ విషయంలో ఊహాగానాలు చేస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ మరియు పార్లమెంట్‌ ఎన్నికల హడావుడి నేపథ్యంలో దేవర విడుదల ఎంత వరకు కరెక్ట్‌ అన్నట్లుగా నిర్మాతలు ఆలోచిస్తున్నారు అనేది పుకారు.

అంతే కాకుండా హిందీలో రెండు పెద్ద సినిమాలు అదే తేదీకి విడుదల అయ్యేందుకు పోటీ పడుతున్నాయి. అక్షయ్ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్ లు నటించిన మల్టీ స్టారర్‌ మూవీ బడే మియా చోటే మియా ఈద్ సందర్భంగా ఏప్రిల్‌ 10న విడుదల అవ్వబోతుంది. ఇక అజయ్‌ దేవగన్‌ నటించిన మైదాన్‌ సినిమా కూడా అదే ఈద్ స్పెషల్‌ గా రాబోతుంది.

ఈ రెండు సినిమాలు కూడా బాలీవుడ్‌ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ రెండు సినిమాలకు పెద్ద ఎత్తున థియేటర్లను సమకూర్చాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో దేవర సినిమాకు హిందీ డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ థియేటర్లను ఇవ్వడం సాధ్యమా అనే అనుమానం కూడా దేవర నిర్మాతల్లో ఉండి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.

ఒక వైపు ఎన్నికలు మరో వైపు బాలీవుడ్‌ లో తీవ్ర పోటీ కారణంగా దేవర సినిమా కి హిట్ టాక్‌ వచ్చినా కూడా భారీగా వసూళ్లను నమోదు చేయలేక పోతుందేమో అనే ఉద్దేశ్యంతో విడుదల వాయిదా వేస్తారని ఎవరికి వారు ఊహించేస్తున్నారు. ఈ కారణాలు నిజంగానే దేవర ని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి.

కనుక విడుదల తేదీ ని వాయిదా వేస్తేనే మంచిది అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి నిర్మాత అభిప్రాయం ఏంటి అనేది మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా లో సైఫ్ అలీ ఖాన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Tags:    

Similar News