'దేవర' అప్డేట్ : జాన్వీతో ఎన్టీఆర్ రొమాంటిక్ లవ్ ధమాకా!

'దేవర 1' సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ కు అనూహ్య రెస్పాన్స్ వచ్చింది.

Update: 2024-08-02 12:47 GMT

యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా 'దేవర'. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషనల్ లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఇది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫస్ట్ పార్ట్ ని వచ్చే నెలాఖరున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే విడుదలకు యాభై రోజుల సమయం మాత్రమే ఉన్నా, ఇంకా ప్రమోషన్స్ స్పీడ్ పెంచకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో వారిని ఉత్సాహ పరిచే ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది.


'దేవర 1' సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ కు అనూహ్య రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ 'ఫియర్' సాంగ్ లిరికల్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో సెకండ్ సింగిల్ ను రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అయిపోయారు. ఆగస్టు 5వ తేదీన రెండో పాటను విడుదల చేయబోతున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లకు సంబంధించిన ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. సిజ్లింగ్ జోడీకా లవ్ ధమాకా రాబోతోందని పేర్కొన్నారు.

'దేవర' నుంచి ఈసారి ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ వస్తోందని పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది. ఫారెస్ట్ బ్యాగ్రౌండ్ లో తారక్, జాన్వీలు ఒకరినొకరు చూసుకుంటూ రొమాంటిక్ ఫోజ్ ఇచ్చారు. వైట్ అండ్ వైట్ లో అతిలోక సుందరి కూతురు చాలా అందంగా కనిపించింది.. దేవకన్యలా మెరిసిపోతోంది. సైడ్ యాంగిల్ లో తన తల్లి శ్రీదేవిని గుర్తు చేస్తోంది. ఎన్టీఆర్ న్యూ లుక్ లో ఆకట్టుకున్నారు. హీరో హీరోయిన్ల కలయికలో వచ్చిన ఫస్ట్ పోస్టర్ కావడంతో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. వర, తంగంల కెమిస్ట్రీ అదిరిపోయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

‘తంగం అంతరంగం.. హాయిగా.. ఉయ్యాలూగుతున్నట్టుంది’ అనే లిరిక్స్ రాసినట్లు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఇటీవ‌ల ఎక్స్ లో పేర్కొన్నారు. అది 'దేవర'లోని రెండో పాటే అయ్యుంటుందని అర్థమవుతోంది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సాంగ్ కు మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. సాబు సిరిల్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా వర్క్ చేస్తున్నారు. ఏ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా 'దేవర' సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండగా.. శృతి మరాఠే, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, కలైయరసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌ పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'దేవర' పార్ట్-1 2024 సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

Tags:    

Similar News