దేవర సైలెన్స్ కి రీజన్ అదేనా..?
అయితే ఈ సినిమా ప్రచారం విషయంలో కొరటాల శివ సైలెన్స్ వెనక రీజన్ ఉందని తెలుస్తుంది.
RRR తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న సినిమా దేవర సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్నాయి. తారక్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్, శృతి మరాఠి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా నుంచి ఆమధ్య వచ్చిన గ్లింప్స్ అదరగొట్టగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ వచ్చిన పోస్టర్ అంచనాలు పెంచింది.
అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ ప్లాన్ చేసిన దేవర 1 ప్రమోషన్స్ ఇంకా స్పీడ్ పెంచలేదు. అయితే ఈ సినిమా ప్రచారం విషయంలో కొరటాల శివ సైలెన్స్ వెనక రీజన్ ఉందని తెలుస్తుంది. సినిమా గురించి ఎంత గోప్యంగా ఉంచితే థియేటర్ లో ఆడియన్స్ అంత ఎగ్జైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే సినిమా ప్రమోషన్స్, పోస్టర్స్ అంటూ మిగతా సినిమాల్లా దేవర హడావిడి చేయట్లేదు. సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్న చిత్ర యూనిట్ హంగామా అంతా వెండితెర మీద చూపించేందుకు కృషి చేస్తున్నారు.
ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న ఎన్.టి.ఆర్ దేవర తో మరోసారి ఆడియన్స్ ని తన నటనతో మెప్పించాలని చూస్తున్నాడు. దేవర లో తను చేసే రెండు పాత్రలతో తన మార్క్ చూపించాలని అనుకుంటున్నాడు తారక్. ఇక సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నారట. కొరటాల శివ ఆచార్య తర్వాత చేస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
ఎన్.టి.ఆర్ కొరటాల శివ ఈ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ఆల్రెడీ సూపర్ హిట్ కాగా ఈ ఇద్దరు కలిసి చేస్తున్న దేవర మీద తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతాయని తెలుస్తుంది. దేవర టీజర్ ను ఎన్.టి.ఆర్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. మే 20 తారక్ పుట్టినరోజు నాడు దేవర నుంచి స్పెషల్ టీజర్ రాబోతుందట. ఇప్పటివరకు దేవర 1 కి సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తి కాగా సినిమాను త్వరగా పూర్తి చేసి అనుకున్న విధంగా అక్టోబర్ 10కి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.