దేవర.. అప్పుడే ట్రోలింగ్ స్టార్ట్ చేసేశారు
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. సినిమాలు, రాజకీయం అని సంబంధం లేకుండా ప్రతి అంశాన్ని ట్రోలింగ్ మెటీరియల్ గా మార్చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా విషయానికి వస్తే ఒకప్పుడు థియేటర్స్ కి పరిమితమైన ఫ్యాన్స్ వార్ ఇప్పుడు సోషల్ మీడియాకి ఎగబాకింది. రకరకాల ఫోటో, వీడియో మీమ్స్ క్రియేట్ చేసి సినిమాలకు సంబంధించి ప్రతి విషయాన్ని ట్రోలింగ్ చేయడం అలవాటుగా మార్చుకున్నారు.
ఆ మధ్య గేమ్ చేంజర్ మూవీ నుంచి తమన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. తమన్ ఆ సాంగ్ కోసం కాపీ ట్యూన్ వాడాడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. అలాగే రామ్ చరణ్, కియారా డాన్స్ ని కూడా ట్రోల్ చేశారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమోని రిలీజ్ అయ్యింది. దీనికి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అనిరుద్ సాంగ్స్, మ్యూజిక్ లో ఎక్కువగా పాప్ వెస్ట్రన్ టచ్ కనిపిస్తూ ఉంటుంది.
అనిరుద్ మ్యూజిక్ ని యూత్ బాగా ఇష్టపడతారు. కోలీవుడ్ ఆడియన్స్ అయితే ఓ విధంగా అనిరుద్ మ్యూజిక్ కి అడిక్ట్ అయిపోయారు. అయితే తెలుగు ఆడియన్స్ పూర్తిస్థాయిలో అనిరుద్ సంగీతాన్ని ఆస్వాదించడం లేదు. అందుకే ఆయన తెలుగులో చేసిన సినిమాలు కూడా మ్యూజికల్ గా డిజాస్టర్ అయ్యాయి. దేవర సినిమా ఫస్ట్ సింగిల్ మే 19న రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోని మే 17న రిలీజ్ చేశారు.
ఇందులో ఉన్న మ్యూజిక్ బీట్ వెస్ట్రన్ టచ్ తో ఉంది. వినడానికి బాగానే ఉన్నా కూడా ఇది కాపీ ట్యూన్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. లియో మూవీ నుంచి బ్యాడాస్ కాపీ చేసి దేవర చిత్రానికి వాడేశారంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దేవర ఫస్ట్ సింగిల్ ట్యూన్ కి ఒరిజినల్ ట్యూన్ ని యాడ్ చేసి సేమ్ ట్యూన్ అంటూ బ్రహ్మానందం, నాగార్జున కింగ్ మూవీ పాపులర్ వీడియోని జత చేసి సెటైరికల్ గా కామెంట్ చేశారు.
వీటిపై నెటిజన్లు నుంచి భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూర్తిగా సాంగ్ వినకుండా ఇలా ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ దేవర మూవీ ఇమేజ్ చెడగొట్టేందుకు జరుగుతున్న కుట్ర అంటూ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. ఈ ట్రోలింగ్ పై మేకర్స్ సాంగ్ తో ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.