రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్.. దేవర అధిగమిస్తుందా..?

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే అప్పటి వరకు ఆ హీరోకి ఉన్న ఇమేజ్ కచ్చితంగా డబుల్ ట్రిపుల్ అవుతుంది.

Update: 2024-01-10 00:30 GMT

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే అప్పటి వరకు ఆ హీరోకి ఉన్న ఇమేజ్ కచ్చితంగా డబుల్ ట్రిపుల్ అవుతుంది. రాజమౌళితో సినిమా పడితే ఆ స్టార్ రేంజ్ మరింత పెరుగుతుంది. అంతేకాదు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వైడ్ గా హీరో పేరు మారు మ్రోగుతుంది. జక్కన్న సినిమా అనౌన్స్ నుంచి రిలీజ్ వరకు ఆయన కమిట్మెంట్, ప్రమోషన్స్ ఇవన్నీ కలిసి స్టార్ ఇమేజ్ ని పెంచేస్తాయి. అయితే ఇదంతా రాజమౌళి సినిమా చేసినప్పుడు ఉండే పరిస్థితి. ఆఫ్టర్ దట్ అసలు సినిమా మొదలవుతుంది.

రాజమౌళి తన సినిమాలో హీరోలను ఒక రేంజ్ లో చూపిస్తారు. రాజమౌళి సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్స్ ఆ తర్వాత సినిమాను ఆ రేంజ్ అంచనాలను అందుకోలేక ఫ్లాప్ ఫేస్ చేస్తారు. ఇప్పటివరకు రాజమౌళి సినిమాల్లో నటించిన ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లెం ఫేస్ చేశారు. రాజమౌళి సినిమతో బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఆ వెంటనే ఆ హీరోకి ఫ్లాప్ పడటం కామన్ అయ్యింది. బాహుబలి లాంటి ట్రెండ్ సెట్టర్ హిట్ పడిన తర్వాత ప్రభాస్ సాహోతో ఆడియన్స్ ని సాటిస్ఫై చేయడంలో విఫలమయ్యాడు.

ఇక ఆర్.ఆర్.ఆర్ తో రాం చరణ్, ఎన్.టి.ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకోగా ఆ సినిమా తర్వాత చరణ్ ఆచార్య డిజాస్టర్ అయ్యింది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆచార్య ఫ్లాప్ మరోసారి రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ని పునరావృతం చేసింది. చరణ్ ఎలాగు అది ఫేస్ చేశాడు. ఇక ఇప్పుడు ఎన్.టి.ఆర్ వంతు వచ్చింది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా కొరటాల శివ డైరెక్షన్ లో వస్తుంది.

ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ చూసి ఈసారి కొరటాల టార్గెట్ మిస్ అవ్వదని అనుకుంటున్నారు. తారక్ కూడా ఊర మాస్ అవతారంలో అదుర్స్ అనిపిస్తున్నాడు. మరి దేవర సినిమా కూడా రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ కు బలవుతుందా లేదా ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసే సినిమా అవుతుందా అన్నది చూడాలి. రాజమౌళి మాత్రం తన సినిమా తర్వాత హీరోలకు ఫ్లాప్ అవ్వడం గురించి తను కూడా బాధ పడుతున్నట్టు తెలుస్తుంది. దేవర సినిమా ఆ సెంటిమెంట్ కి బ్రేక్ చేస్తే మాత్రం ఈ విధంగా కూడా ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News