దేవర.. పోటీగా పెద్ద తలే వస్తోంది!

ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర చేస్తున్న సంగతి తెలిసిందే

Update: 2024-04-08 14:30 GMT

ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా రూపొందుతున్న దేవర తొలి భాగం ఈపాటికే విడుదల కావాల్సి ఉంది. విలన్ సైఫ్ అలీ ఖాన్ కు యాక్సిడెంట్ తో పాటు కొన్ని కారణాల వల్ల మేకర్స్ ఈ మూవీ రిలీజ్ ను అక్టోబర్ కు వాయిదా వేశారు.

ఈ సినిమాలోని ఓ సాంగ్ తోపాటు కొంత పార్ట్ షూటింగ్ రీసెంట్ గా గోవాలో జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ మ్యూజిక్ సంబంధించి హీరో విశ్వక్ సేన్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ లో ఉందని, అనిరుధ్ అదరగొట్టేశారని ట్వీట్ చేసి.. మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు దేవరకు పోటీగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జైలర్ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చిన రజినీకాంత్.. ఈ ఏడాది ఆయన నటించిన లాల్ సలాం బెడిసికొట్టింది. ఇప్పుడు రజినీ.. జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్‌ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ రీసెంట్‌ గా తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ జ‌రుపుకుంది. ఆంధ్రప్రదేశ్‌ లోని క‌డ‌ప జిల్లాలో షూటింగ్ చేశారు మేకర్స్.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేకర్స్ ఇటీవల వెల్లడించారు. కానీ డేట్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు. దీంతో ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీన విడుదల అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతకుముందు సెప్టెంబర్ 27వ తేదీన పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కూడా రిలీజ్ కానుంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలతో బాక్సాఫీస్ వద్ద రజినీ పోటీ పడనున్నారన్నమాట.

ఈ ఏడాది సంక్రాంతి టైమ్ లో కూడా ఇలాంటి పోటీయే నెలకొనగా.. తమిళ సినిమాలు తప్పుకున్నాయి. డైరెక్ట్ తెలుగు చిత్రాలకు ఛాన్స్ ఇచ్చాయి. మరీ ఈ సారి కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుందా? లేక రజినీ మూవీ డేట్ మారుతుందా అనేది చూడాలి. దేవర, ఓజీ, వెట్టయాన్‌ సినిమాలపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యి ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో?

Tags:    

Similar News