ఇప్పుడు దేవి దగ్గరున్న ఒకే ఒక్క ఆయుధం

నిజానికి సుకుమార్ మొదటి సినిమా నుంచి 'పుష్ప' వరకు దేవిశ్రీ ప్రసాద్ తోనే వర్క్ చేస్తున్నారు.

Update: 2024-11-10 04:48 GMT

'పుష్ప 2' బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం లేదనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దానికోసం సుకుమార్ థమన్ ని తీసుకున్నారని అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాలలో కూడా ప్రస్తుతం దీనిపైనా చర్చ నడుస్తోంది. నిజానికి సుకుమార్ మొదటి సినిమా నుంచి 'పుష్ప' వరకు దేవిశ్రీ ప్రసాద్ తోనే వర్క్ చేస్తున్నారు.

వేరొక మ్యూజిక్ డైరెక్టర్ కి వెళ్ళలేదు. అయితే 'పుష్ప 2' విషయంలో మాత్రం వేరొక పేరు వినిపిస్తోంది. ఈ చిత్రంలోని సాంగ్స్ మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చాడని అంటున్నారు. ఈ రూమర్ కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం మేకర్స్ మీద ఉంది. మరో వైపు బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా ప్రస్తుతం సౌత్ లో అజనీష్ లోకనాథ్, అనిరుద్, జీవీ ప్రకాష్ కుమార్, థమన్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ 'పుష్ప' సినిమాకి మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.

అయితే ఆడియన్స్ ఎలివేషన్స్ పరంగా ఇంకా ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పరంగా 'కంగువా' సినిమాతో గట్టిగా కొట్టాల్సిందే. ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం అని చెప్పాలి. 'కంగువా' నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, ట్రైలర్ లలో దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతంగా ఉంది. అదే టెంపోని సినిమా మొత్తం మెయింటేన్ చేస్తే కచ్చితంగా మంచి ప్రశంసలు లభిస్తాయి.

ప్రస్తుతం ట్రెండ్ లో వస్తోన్న సినిమాలకి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యంగా మారింది. దర్శకులు కూడా సాంగ్స్ కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పటిలా సినిమాలలో 5, 6 పాటలు ఉండటం లేదు. సిచువేషన్ కి సరిపోయే విధంగా 2, 3 సాంగ్స్ మాత్రమే పెడుతున్నారు. అదే సమయంలో కథని చాలా పవర్ ఫుల్ గా అదిరిపోయే ఎలివేషన్స్ తో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలాంటి కథల కోసం దేవిశ్రీ ప్రసాద్ పేరుని పరిగణంలోకి తీసుకోవాలంటే 'కంగువా' మూవీతో స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అలాగే 'పుష్ప 2' బ్యాగ్రౌండ్ స్కోర్ దేవిశ్రీ ప్రసాద్ కాకుండా వేరొకరికి ఇచ్చి ఉంటే కచ్చితంగా రాక్ స్టార్ కి పబ్లిక్ నుంచి సింపతీ వస్తుందనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మరి దేవి కంగువా ఆయుధం ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.

Tags:    

Similar News