సింపుల్ కాదు శాంపిలే.. హింట్ ఇచ్చి హైప్ పెంచేశాడు..!

ఆ సాంగ్ లో సింపుల్ స్టెప్స్ ఉన్నాయని కామెంట్స్ రాగా అది శాంపిల్ మాత్రమే అని అసలైన డాన్స్ రివీల్ చేయలేదని అన్నారు దేవి శ్రీ.. సాంగ్ పిక్చరైజేషన్ లో ది బెస్ట్ అవుతుందని అన్నారు.

Update: 2024-07-17 14:43 GMT

అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమాపై ఇప్పటికే అంచనాలు ఒక రేంజ్ లో ఉండగా లేటెస్ట్ గా ఈ సినిమా గురించి ఒక వార్త చెప్పి మరింత హైప్ పెంచాడు ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. డీఎస్పీ లైవ్ కాన్సర్ట్ ని అక్టోబర్ లో ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 10న గచ్చిబౌలిలో ఇది జరగనుంది. ఈ లైవ్ కాన్సర్ట్ కి సంబంధించిన విషయాలు చెప్పేందుకు మీడియాతో ముచ్చటించిన డీఎస్పీ పుష్ప 2 గురించి కూడా మాట్లాడారు.

సుకుమార్ అల్లు అర్జున్ కాంబో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తుందని అన్నారు దేవి శ్రీ.. పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పుష్ప 2 పై ప్రపంచ స్థాయిలో అంచనాలు ఉన్నాయని. ఐతే ఆ అంచనాలు అందుకునేందుకు తామంతా ఒత్తిడి లేకుండా పనిచేస్తున్నామని అన్నారు. ఇక పుష్ప 2 నుంచి రిలీజైన రెండు సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందన్న దేవిశ్రీ ప్రసాద్.. సూసేకి సాంగ్ అస్సాం లో కూడా రిపీటెడ్ గా వింటున్నారని అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.

ఆ సాంగ్ లో సింపుల్ స్టెప్స్ ఉన్నాయని కామెంట్స్ రాగా అది శాంపిల్ మాత్రమే అని అసలైన డాన్స్ రివీల్ చేయలేదని అన్నారు దేవి శ్రీ.. సాంగ్ పిక్చరైజేషన్ లో ది బెస్ట్ అవుతుందని అన్నారు. సో అక్కడ ఉంది సుకుమార్ అల్లు అర్జున్ కాబట్టి ఏం చేస్తారన్నది తెర మీద చూడాల్సిందే. సూసేకి సాంగ్ రిలీజైనప్పుడు అదేం డ్యాన్స్ అని కొందరు కామెంట్ చేశారు. ఐతే అసలు డ్యాన్స్ వెండితెర మీద చూస్తారని దేవి మాటలను బట్టి అర్ధమవుతుంది.

ఇక పుష్ప 2 రిలీజ్ పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సినిమాకి ఇంకా నెల రోజుల పాటు షూటింగ్ జరగాల్సి ఉన్నా డైరెక్టర్, హీరో ఇద్దరు వెకేషన్ లో ఉన్నారు. అసలే ఆగష్టు 15 కి అనుకున్న సినిమా కాస్త డిసెంబర్ 6కి వాయిదా పడగా ఇప్పుడు ఆ డేట్ కైనా రిలీజ్ చేస్తారా లేదా అన్న డౌట్ రైజ్ అవుతుంది. మరి ఈ వారలకు ఫుల్ స్టాప్ పడాలంటే మాత్రం చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.

Tags:    

Similar News