రాక్ స్టార్ డీఎస్పీ కల నిజమైన వేళ..!

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ 1999లో దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్షన్ మొదలు పెట్టారు. మార్చి 12న ఆ సినిమా రిలీజైంది.

Update: 2024-03-13 07:46 GMT

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ 1999లో దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్షన్ మొదలు పెట్టారు. మార్చి 12న ఆ సినిమా రిలీజైంది. అంటే నిన్నటితో దేవి శ్రీ ప్రసాద్ పాతికేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక సర్ ప్రైజ్ ఫోటో షేర్ చేసి తన జీవిత కాలపు కోరిక నెరవేరిందంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. కోడి రామకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన దేవి సినిమాకు తొలిసారి మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తన పేరులో దేవిని జత చేసుకున్నాడు.

దేవి సినిమా నుంచి డీఎస్పీ తన మ్యూజిక్ తో సినిమాకు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తీసుకొచ్చాడు. మొదట్లో యువ హీరోలతో పనిచేసిన దేవి శ్రీ ప్రసాద్ ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా దేవి శ్రీ ప్రసాద్ స్టార్ హీరోలందరికీ మ్యూజిక్ అందించాడు. ఇక పాతికేళ్ల తన సినీ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా తన గురువు మ్యాస్ట్రో ఇళయరాజా తో దిగిన ఫోటోను షేర్ చేశాడు దేవి శ్రీ ప్రసాద్.

తన స్టూడియోలో ఇళయరాజా ఫోటోని ఉంచుకున్న దేవి శ్రీ ప్రసాద్ దాని కింద మ్యూజిక్ కి మనిషి రూపం అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టాడు. అయితే ఆ ఫోటో ముందు తన గురువు ఇళయరాజా తో ఫోటో దిగాలని కొన్నాళ్లుగా అనుకుంటున్నాడు దేవి శ్రీ. అది ఇన్నాళ్లకు కుదిరింది. దేవి శ్రీ ప్రసాద్ స్టూడియోకి ఇళయరాజా రాగా ఆయన ఫోటో ముందే ఆయనతో ఫోటో దిగి ఇన్నాళ్లకు తన జీవితకాలపు కల నెరవేరింది అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు దేవి శ్రీ ప్రసాద్.

కేవలం సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో అదరగొట్టాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా పాతికేళ్లు పూర్తి చేసుకున్న దేవి శ్రీ ప్రసాద్ కు సంగీత ప్రియులంతా కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈమధ్య కాస్త ట్రాక్ తప్పినట్టుగా అనిపించిన దేవి శ్రీ ప్రసాద్ పుష్ప ది రైజ్ తో తన సత్తా చాటగా త్వరలో రాబోతున్న పుష్ప 2 తో మరోసారి తన మ్యూజిక్ తో అద్భుతాలు చేయాలని చూస్తున్నాడు డీఎస్పీ. సూర్య లీడ్ రోల్ లో వస్తున్న కంగువ.. ధనుష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న కుబేర సినిమాలకు కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలతో డీఎస్పీ అదరగొట్టేయాలని ఫిక్స్ అయ్యాడని చెప్పొచ్చు.

Tags:    

Similar News