వాళ్ల నోళ్లు మూయించబోతున్న దేవి శ్రీ..!
అయితే ఇదంతా ఒకప్పుడు దేవి ఇప్పుడు దేవి ఇలా కాదని అనుకుంటున్నారు ఆడియన్స్.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే యూత్ ఆడియన్స్ కి ఒక మ్యాడ్ నెస్. దేవి మ్యూజిక్ అందించిన సినిమా కేవలం మ్యూజిక్ కోసం చూసేయొచ్చు అనేంతగా క్రేజ్ తెచ్చుకున్నాడు. స్టార్ సినిమా అయినా చిన్న సినిమా అయినా బడ్జెట్ తో సంబంధం లేకుండా తన బాణీలతో బొమ్మ సూపర్ హిట్ అయ్యేలా చేస్తాడు డిఎస్పి. అయితే ఇదంతా ఒకప్పుడు దేవి ఇప్పుడు దేవి ఇలా కాదని అనుకుంటున్నారు ఆడియన్స్.
ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో దేవి మార్క్ మిస్ అవుతుందని. దేవి లో కసి తగ్గిందని చెప్పుకుంటున్నారు. నేను మారలేదు నేను మునుపటి దేవినే అని అప్పుడప్పుడు డీఎస్పీ ప్రూవ్ చేసుకుంటున్నా సరే ఆహా ఇది చాలదు మాకు ఒకప్పటి దేవి శ్రీ కావాలని అంటున్నారు. పుష్ప 1 తో దేవి తన మార్క్ చూపించాడు. సుకుమార్ దేవి శ్రీ అల్లు అర్జున్ కాంబో అంటే చాలు ఆ అంచనాలకు తగినట్టుగా మ్యూజిక్ ఉంటుంది.
పుష్ప 1 హిట్ లో దేవి మ్యూజిక్ కూడా బాధ్యత వహించింది. అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ మళ్లీ బాబోయ్ ఈ సినిమాలకు సంగీతం ఇచ్చింది డీఎస్పీనేనా అనేలా చేశాడు. రౌడీ బాయ్స్ ఓకే అనేలా ఉన్నా ఖిలాడి, ఆడవాళ్లు మీకు జోహార్లు, ది వారియర్, రంగ రంగ వైభవంగా ఇలా అన్ని వరుస ఫ్లాపులు చేశాడు. ఈ సినిమాల్లో దేవి మార్క్ మ్యూజిక్ కూడా కనిపించలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మాత్రం మెగా ఫ్యాన్స్ ని అలరించింది.
ఇదిలా ఉంటే ఈ ఇయర్ దేవి సినిమాల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 తో పాటుగా నాగ చైతన్యతో తండేల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేతిలో ఉన్నాయి. వీటితో పాటుగా నాగార్జున ధనుష్ శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ సినిమాలతో డిఎస్పి అంటే ఏంటో మరోసారి చూపించాలని ఫిక్స్ అయ్యాడు.
ఓ పక్క పోటీగా థమన్ దూకుడు చూపిస్తుండగా మలయాళం నుంచి హేషం అబ్ధుల్ వాహబ్, తమిళ పరిశ్రమ నుంచి జివి ప్రకాష్, జిబ్రాన్, సంతోష్ నారాయణన్ తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నారు. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ కీరవాణి కూడా రాజమౌళితో పాటుగా బయట దర్శకులకు సంగీతం అందిస్తున్నారు. ఈ టైం లో దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాల్సిన అవసరం ఉంది. తన గురించి ట్రోల్ చేసిన వారందరి నోళ్లు మూయించేలా తను చేస్తున్న ఈ సినిమాలతో తన వాయించుడు షురూ చేస్తున్నాడు డిఎస్పి. మరి ఈ సినిమాలతో అయినా దేవి మార్క్ కనిపిస్తుందా లేదా అన్నది చూడాలి.