పిక్‌టాక్‌ : టైగర్స్‌ బ్యూటీ అందాన్ని చూశారా!

తాజాగా ఈమె షేర్‌ చేసిన ఫోటోల్లో పొట్టి నెక్కర్‌ వేసుకుని చూపు తిప్పుకోనివ్వడం లేదు.

Update: 2025-01-07 12:30 GMT

సోషల్‌ మీడియా ముద్దుగుమ్మలకు మంచి ప్లాట్‌ ఫామ్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా హీరోయిన్‌గా ప్రయత్నాలు చేస్తున్న ముద్దుగుమ్మలకు తమ అందాలను చూపించేందుకు, తమ ప్రతిభను చూపించేందుకు మంచి ప్లాట్‌ ఫామ్‌గా నిలుస్తుంది. ఎంతో మంది ముద్దుగుమ్మలు కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫోటోలు, వీడియోలు షేర్‌ చేయడం ద్వారా హీరోయిన్స్‌గా పరిచయం అవుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ఫౌజీ సినిమాలో నటిస్తున్న ముద్దుగుమ్మ సోషల్‌ మీడియా ద్వారా పరిచయం అయిన విషయం అందరికీ తెల్సిందే. అందుకే చాలా మంది సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌గా అందాల ఆరబోత చేస్తూ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు.

అప్పట్లో మాదిరిగా ఒక్క ఛాన్స్ అంటూ స్టూడియోల చుట్టూ, నిర్మాతల చుట్టూ తిరగకుండా సోషల్‌ మీడియాలో తమ సత్తా చాటే విధంగా కంటెంట్‌ పోస్ట్‌ చేస్తే నిర్మాతలు వెతుక్కుంటూ వస్తారు. అందుకే చాలా మంది కొత్త హీరోయిన్స్‌, హీరోయిన్‌గా ఛాన్స్‌ల కోసం ఎదురు చూస్తున్న వారు ఇలా అంతా సోషల్‌ మీడియా ద్వారా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటారు. స్టార్‌ హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తమ ఫోటోలతో ఫ్యాన్స్‌లో మరింతగా ఫాలోయింగ్‌ దక్కించుకుంటున్నారు. నటిగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న ముద్దుగుమ్మ దేవియాని శర్మ.

ఆ మద్య వచ్చిన సేవ్ ది టైగర్స్ అనే కామెడీ వెబ్‌ సిరీస్‌లో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటిగా కనిపించింది. హీరోయిన్‌గా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా సోషల్ మీడియా ద్వారా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందమైన బోటింగ్‌ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. సేవ్‌ ది టైగర్‌ సినిమాలో చాలా పద్దతిగా కనిపించిన దేవియాని శర్మ సోషల్‌ మీడియాలో మాత్రం బాలీవుడ్‌ అందాల హీరోయిన్స్‌కి ఏమాత్రం తగ్గకుండా తన అందాన్ని చూపిస్తూ ఉంటుంది.


తాజాగా ఈమె షేర్‌ చేసిన ఫోటోల్లో పొట్టి నెక్కర్‌ వేసుకుని చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఈ స్థాయి అందాల ఆరబోత కేవలం ఈ ముద్దుగుమ్మకే సాధ్యం అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇలాంటి అందాన్ని మరింతగా సోషల్‌ మీడియా ద్వారా ఫోటో షూట్స్ రూపంలో చూపిస్తే కచ్చితంగా ముందు ముందు అయినా ఆఫర్లు వరుసగా వస్తాయనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. నటిగా మంచి పేరును తెచ్చుకున్న ఈ అమ్మడు ముందు ముందు యంగ్‌ స్టార్‌ హీరోల దృష్టిని ఆకర్షించి సినిమా ఆఫర్లను దక్కించుకుంటుందేమో చూడాలి.

Tags:    

Similar News