సీక్వెల్ కోసం రీమేక్ వ్యూహం ఫ‌లిస్తుందా?

చాలా సౌత్ రీమేక్‌లు బాలీవుడ్‌లో ఘ‌న‌విజయం సాధిస్తున్నాయి. కొన్నిసార్లు విఫ‌ల‌మ‌వ్వ‌డం చూస్తున్నాం

Update: 2024-05-29 05:09 GMT

చాలా సౌత్ రీమేక్‌లు బాలీవుడ్‌లో ఘ‌న‌విజయం సాధిస్తున్నాయి. కొన్నిసార్లు విఫ‌ల‌మ‌వ్వ‌డం చూస్తున్నాం. ఏది ఏమైనా కానీ ఒరిజిన‌ల్ స్క్రిప్టుల‌పై ఆధార‌ప‌డ‌కుండా ఇలా రీమేక్‌లు చేయ‌డంపై హిందీ ప్ర‌జ‌లు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. హిందీ ఫిలింమేక‌ర్స్ ఇక‌పై ఒరిజిన‌ల్ క‌టెంట్‌ని ప్రిపేర్ చేయాల‌ని ఆశిస్తున్నారు.

అయినా క‌ర‌ణ్ జోహార్ కి చెందిన ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ ఒక హిట్ సినిమా రీమేక్ నే హిందీలో నిర్మించేదుకు ప్ర‌య‌త్నించింది. కులాంత‌ర ప్రేమ‌క‌థ ఆధారంగా రూపొందుతున్న ధ‌డ‌క్ 2 `పారియెరం పెరుమాల్` అనే త‌మిళ చిత్రానికి రీమేక్. వేర్వేరు కులాలకు చెందిన ఒక అబ్బాయి - అమ్మాయి ప్రేమలో పడతారు. ఇలాంటి విల‌క్ష‌ణ‌మైన‌ ప్రేమ క‌థ‌లో ఘ‌ర్ష‌ణ ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి. సిద్ధంత్ చతుర్వేది, ట్రిప్తి దిమ్రీ జంట‌గా నటించిన ధ‌డ‌క్ 2 ఈ ఏడాది నవంబర్‌లో విడుదల కానుంది.

ఇంత‌కుముందు ధ‌డ‌క్ చిత్రాన్ని మ‌రాఠాలో ఘ‌న‌విజ‌యం సాధించిన సైరాట్ ఆధారంగా రూపొందించారు. జాన్వీ- ఇషాన్ ఖత్త‌ర్ జంట‌గా నటించిన ఈ సినిమాని క‌ర‌ణ్ జోహార్ కి చెందిన ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. ఇప్పుడు సీక్వెల్ ని కూడా వేరొక భాష నుంచి అడాప్ట్ చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రం. ధ‌డ‌క్ 2 ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ ఆక‌ట్టుకోవ‌డంతో బిజినెస్ ప‌రంగాను బావుంద‌న్న టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News