నార్త్ నుంచి సౌత్ కి షిప్ట్ అయిన సీక్వెల్!
జాన్వీకపూర్- ఇషాన్ కట్టర్ జంటగా కరణ్ జోహర్ నిర్మించిన `ధడక్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
జాన్వీకపూర్- ఇషాన్ కట్టర్ జంటగా కరణ్ జోహర్ నిర్మించిన `ధడక్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. మరాఠి చిత్రం `సైరత్` కి రీమేక్ గా శశాంక్ కట్టన్ తెరకెక్కించారు. కులాంతర ప్రేమ వివాహం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా జాన్వీ-ఇషాన్ లకు బాలీవుడ్ లో మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఇప్పుడీ సినిమా కరణ్ జోహర్ సీక్వెల్ ప్రకటించారు. `ధడక్ -2` టైటిల్ తో షాజియా ఇక్బాల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో త్రిప్తీ డిమ్రీ- సిద్దాంత్ చతుర్వేది హీరో, హీరోయిన్లగా నటిస్తున్నారు.
మరి ఈ సీక్వెల్ కి మూలం ఏంటి? మొదటి భాగాన్ని ఆధారంగా చేసుకుని కథ సిద్దం చేసారా? లేక మరో కొత్త నేపథ్యాన్ని తీసుకుంటున్నారా? అంటే ఆ విషయం కూడా రివీల్ చేసేసారు. ఈసారి సీక్వెల్ కోసం ఏకంగా మరాఠీ నుంచి కథని తమిళనాడుకి షిప్ట్ చేసారు. `పరియేరుమ్ పెరుమాళ్` అనే చిత్రానికి రీమేక్ రూపంగా ఈ సీక్వెల్ ని ప్రకటించారు. తమిళ్ లో ఈ చిత్రాన్నా పా రంజిత్ తెరకెక్కించాడు. ఆసినిమాకి సీక్వెల్ గానే ధడక్ -2 ప్రకటించారు.
దీనికి సంబంధించి ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు. `ఒకానొక సమయంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు. వారు వేర్వేరు సామాజిక వర్గాలను చెందిన వారు. అంతే కథ ముగిసిందంటూ` కరణ్ అక్కడితో స్టాప్ చేసారు. ఓసారి మాతృక సినిమా `పరిమేరుమ్ గురించి చూస్తే..` నిమ్న వర్గానికి చెందిన అబ్బాయి...అగ్ర వర్గానికి చెందిన అమ్మాయి ప్రేమలో పడటం..కులోన్మాదలు వలల పడి చిత్రవధలకు గురైన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. 2018లో విడుదలైన సినిమా మంచి విజయం సాధించింది.
అలాగే వివాదాల్ని కూడా తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో కరణ్ మరోసారి నేపథ్యంలో పెద్దగా మార్పులు లేకుండా అదే మూలం ఉన్న కథని తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో శంకర్ కూడా `ప్రేమిస్తే` అనే సినిమాని ఇలాంటి జానర్ లో చేసి మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అది కూడా మధురైలో ఓ జంట జీవితంలో చోటు చేసుకున్న వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించారు.