రాఘ‌వేంద్ర‌రావు కంట‌ప‌డితే 'పెళ్లి సందడి-3' తీస్తాడేమో!

అక్క‌తో పెళ్లి కుదరక ముందే చెల్లితో ప్రేమ‌లో ప‌డిన యువ‌కుడి క‌థ‌తో చాలా గ‌మ్మ‌త్త‌యిన సినిమాలొచ్చాయి

Update: 2023-11-10 16:01 GMT

అక్క‌తో పెళ్లి కుదరక ముందే చెల్లితో ప్రేమ‌లో ప‌డిన యువ‌కుడి క‌థ‌తో చాలా గ‌మ్మ‌త్త‌యిన సినిమాలొచ్చాయి. అక్కా చెల్లెళ్లు ప్యార‌ల‌ల్ గా ఒకే యువ‌కుడిని ప్రేమిస్తే, ఆ త‌ర్వాత స‌రిగ‌మ‌లు ఏమిట‌న్న‌ది ఎంతో హృద్యంగా రొమాంటిక్ గా తెర‌కెక్కించారు కె.రాఘ‌వేంద్ర‌రావు. అత‌డు తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ 'పెళ్లి సంద‌డి' గురించే ఇదంతా. ఇందులో అక్కా చెల్లెళ్లు ధీప్తి భ‌ట్నాగ‌ర్- ర‌వ‌ళి న‌డుమ న‌లిగిపోయే యువ‌కుడిగా శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్ న‌టించారు. ఈ సినిమా హీరో శ్రీ‌కాంత్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఇక ఇదే సినిమాలో న‌టించిన దీప్తి భ‌ట్నాగ‌ర్, ర‌వ‌ళి కెరీర్ లు కూడా దక్షిణాదిన‌ ఓ వెలుగు వెలిగాయి. చాలా గ్యాప్ త‌ర్వాత కె.రాఘ‌వేంద్ర‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వేరొక ద‌ర్శ‌కుని నిర్ధేశ‌నంలో పెళ్లి సంద‌-డి కూడా తెర‌కెక్కింది. ఇది సీక్వెల్ కాని క‌థ‌తో రూపొంది యావ‌రేజ్ ఫ‌లితం అందుకుంది. ఈ సినిమాలో న‌టించిన అందాల క‌థానాయిక శ్రీ‌లీల కెరీర్ స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా ఉంది.


ఇక‌పోతే త్వ‌ర‌లో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి పెద్ద కుమార్తె జాన్వీ, త‌న సోద‌రి ఖుషీతో క‌లిసి న‌టిస్తే బావుంటుంది అంటూ ఇప్పుడు వెబ్ లోకి వచ్చిన ఈ ఫోటోల బంచ్ చూసిన అభిమానులు కోరుకుంటున్నారు. అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రూ ఎంతో ట్రెడిష‌న‌ల్ గా దీపావ‌ళి సెల‌బ్రేష‌న్ కి ముస్తాబ‌య్యారు. చీర‌ల్లో సిస్ట‌ర్స్ సింగారం గుండెలు కొల్ల‌గొడుతోంది. జాన్వీ క‌పూర్ - ఖుషీ క‌పూర్ చీరందాలు యూత్ కి మ‌తులు చెడగొడుతున్నాయి. అందుకే ఈ ఇద్దరూ ఇలా కే.రాఘ‌వేంద్ర‌రావు కంట ప‌డితే వెంట‌నే ఆయ‌న 'పెళ్లిసంద‌డి 3' తీస్తాడేమో! అంటూ యూత్ స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ అదే నిజ‌మైతే శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ ని హీరోగా ఎంపిక చేస్తారేమో!


త్వ‌ర‌లోనే జాన్వీ క‌పూర్ 'దేవ‌ర' చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టేస్తోంది. ఇక ఖుషీ కపూర్ కూడా టాలీవుడ్ కి ప‌రిచ‌యం కావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. ప్ర‌స్తుతం బోనీ క‌పూర్ త‌న ఇద్ద‌రు కుమార్తెల‌ను పెద్ద స్టార్ల‌ను చేయాల‌ని క‌ల‌లుగంటున్నారు. హిందీ చిత్ర‌సీమ‌తో పాటు తెలివిగా ఇటు టాలీవుడ్ కోలీవుడ్ లోను కెరీర్ ని సెట్ చేసేందుకు పాపా బోనీ తీవ్ర ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. ఖుషీ క‌పూర్ త్వ‌ర‌లో ది ఆర్చీస్ చిత్రంతో అభిమానుల‌ను అల‌రించేందుకు దూసుకొస్తోంది. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ లో ఖుషీ పెర్ఫామెన్స్ ఆక‌ట్టుకుంది.

Tags:    

Similar News