ధనుష్.. రెమ్యునరేషన్ ఏ రేంజ్ లో అడుగుతున్నాడంటే..
ఈ సినిమాకు ధనుష్ నెవ్వర్ బిఫోర్ అనేలా భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా క్రేజ్ అందుకునే హీరోల లిస్టు చాలానే ఉంది. ఇక అలాంటి వారిలో ధనుష్ ఒకరు.
తమిళ నటుడు ధనుష్, ఈ తెలుగులోనూ, హిందీలోనూ తన బలాన్ని పెంచుకుంటున్నారు. ఇటీవల వేంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ చిత్రంలో నటించి తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న ధనుష్, ఇప్పుడు అదే తరహాలో మరో బిగ్ హిట్ అందుకోవాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఈ సినిమాకు ధనుష్ నెవ్వర్ బిఫోర్ అనేలా భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు తమిళంలో తీసుకున్న రెమ్యునరేషన్ కంటే కూడా ఇది చాలా ఎక్కువ. సాధారణంగా తమిళ నిర్మాతలు ధనుష్‌కు అడిగినంత పారితోషికం ఇవ్వడంలో తగినంత ఆసక్తిని కనపరచడం లేదు. ఎందుకంటే తమిళంలో అతనికి వచ్చిన హిట్స్ అలాంటివి. 100 కోట్ల మార్కెట్ ను కూడా ఈమద్యే టచ్ చేశాడు.
ఇక తెలుగులో మాత్రం అతని సినిమాలు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రాఫిట్స్ ఇస్తున్నాయి. అందుకే రెమ్యునరేషన్ కూడా గట్టిగానే పెరిగింది. ఈ నేపథ్యంలో, ఆయన ప్రస్తుతం ఓ యువ నిర్మాతతో తన తదుపరి తెలుగులో సినిమా గురించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని టాక్. కానీ, ఇందులో ధనుష్ డిమాండ్ చేసిన పారితోషికం హాట్ టాపిక్ గా మారింది.
ఒకేసారి 60 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు టాక్. ఈ డిమాండ్ నిర్మాతలను ఆశ్చర్యపరిచేలా చేసింది. ఈ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్ పై నిర్మాతలు ఇంకా స్పందించలేదు. దీంతో, ఈ సినిమాపై అనేక అనుమానాలు, చర్చలు జరుగుతున్నాయి. తెలుగులో ఈ ట్రెండ్ మొదలవడంతో, తమిళ నటులు గరిష్ఠ పారితోషికాలను కోరడం మొదలుపెట్టారు. ఉదాహరణకి, దుల్కర్ సల్మాన్ కూడా తెలుగులో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, భారీ పారితోషికాలను డిమాండ్ చేస్తూ సినిమాలు చేస్తూ వచ్చారు.
సొంత భాషలో నిర్మాతల కంటే కూడా ధనుష్ కు ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలు మరింత దగ్గరవుతున్నట్లు అర్ధమవుతుంది. మరి అతను అడిగినంత ఇస్తారో లేదో చూడాలి. రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా ఓకే కానీ ప్రతీ సినిమాకు అదే తరహాలో తీసుకుంటే అన్నిసార్లు వర్కౌట్ కాదు. సినిమాలకు నెగిటివ్ టాక్ వస్తే రెండవరోజే థియేటర్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. కాబట్టి అడిగినంత ఇవ్వడంలో నిర్మాతలు కాస్త జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.