వాళ్లు మాత్రమే నన్ను అర్థం చేసుకుంటారు

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇటీవల స్టార్‌ హీరో ధనుష్‌ పై చేసిన ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు సంచలనంగా మారిన విషయం తెల్సిందే.

Update: 2024-12-09 05:01 GMT

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇటీవల స్టార్‌ హీరో ధనుష్‌ పై చేసిన ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు సంచలనంగా మారిన విషయం తెల్సిందే. నయనతార ఎంత వాదించినా తన అనుమతి లేకుండా తన సినిమాలోని విజువల్స్‌ను వినియోగించినందుకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాల్సిందిగా కాపీరైట్‌ యాక్ట్‌ కింద కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెల్సిందే. ధనుష్ తీరును కొందరు తప్పుబడుతూ ఉంటే కొందరు మాత్రం ఆయన్ను సమర్థిస్తూ ఉన్నారు. ఆయన సినిమాకు సంబంధించిన విజువల్స్ వినియోగిస్తే కాపీ రైట్‌ వేసే హక్కు ఆయనకు ఉంది. ఈ విషయంలో ఆయన్ను తప్పు పట్టడం ఎందుకు అంటూ కొందరు ఆయనకి సపోర్ట్‌గా మాట్లాడుతూ ఉన్నారు.

నాన్ రౌడీ ధాన్‌ సినిమా షూటింగ్‌లోని కొన్ని సెకన్ల వీడియోను నయనతార డాక్యుమెంటరీలో వినియోగించడంతో వివాదం మొదలైంది. చాలా కాలం పాటు ధనుష్ నుంచి అనుమతి కోసం వెయిట్‌ చేసినా ఆయన నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో చేసేది ఏమీ లేక ఫోన్‌ నుంచి తీసిన వీడియోను తమ డాక్యుమెంటరీలో వినియోగించినట్లుగా నయనతార తరపు లాయర్‌ పేర్కొన్నారు. అయితే ఆ విజువల్స్‌పై పూర్తి హక్కు ధనుష్‌కి చెందుతాయని అటు వైపు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వివాదం రాజుకుంటూ పెద్దది గా మారింది.

ధనుష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాతో సన్నిహితంగా ఉండేవారికి, నా క్లోజ్‌ ఫ్రెండ్స్‌కి నేను ఎలా ఉంటానో తెలుస్తుంది. నేను అంత సులభంగా ఎవరికీ అర్థం కాను, ఎవరికి దగ్గర కాను, ఎవరిని అయినా నేను దగ్గరికి రానివ్వాలి అంటే కొంత సమయం పడుతుంది. నాతో చాలా కాలం పరిచయం ఉన్న వారు నేనేం చేసినా అర్థం చేసుకుంటారు. నా నిర్ణయాలు వారికి మాత్రమే అర్థం అవుతాయి అంటూ ధనుష్ చెప్పుకొచ్చాడు. దాంతో ఈ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఇంతకు ఈ విషయంను ఏ కారణంగా చెప్పాడు, ఇంతకు ధనుష్‌ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు.

సార్‌ సినిమాతో తెలుగు లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ధనుష్ మరోసారి కుబేరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న కుబేరా సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. తెలుగు, తమిళ్‌లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కాబోతుంది. మరి ఈ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News