ఆ స్టార్ హీరో నిరాశ పరిచినా మళ్లీ ఉత్సాహం నింపేలా!
కానీ ఈ చిత్రం అదే నెల 21 వాయిదా పడింది. యువ నటీనటులతో ధనుష్ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో బజ్ బాగానే ఉంది.
2025 పొంగల్ సీజన్ కి కోలీవుడ్ హీరోలు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏ స్టార్ హీరో సినిమా ఈ పొంగల్ కి రిలీజ్ అవ్వలేదు. ఆ హీరోలు నటిస్తోన్న చిత్రాలన్నీ ఆన్ సెట్స్ లో ఉండటంతో రిలీజ్ సాద్యపడలేదు. దీంతో హీరోలందరి దృష్టి ఇప్పుడు సమ్మర్ పైనే పడుతోంది. సమ్మర్ లో ఒక్కొక్కరుగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి తొలి వారంలో ధనుష్ దర్శకత్వం వహిస్తోన్న 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్' రిలీజ్ అవుతుందని భావించారు.
కానీ ఈ చిత్రం అదే నెల 21 వాయిదా పడింది. యువ నటీనటులతో ధనుష్ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో బజ్ బాగానే ఉంది. ధనుష్ నటించకపోయినా? దర్శకుడిగా సక్సెస్ అయిన నేపథ్యంలో సినిమా ఎలా ఉంటుందనే ఉత్సాహం అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే ధనుష్ హీరోగా నటిస్తోన్న 'ఇడ్లీ కడై' మాత్రం ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతుంది.
దీంతో రిలీజ్ తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ల ఆశలపై ధనుష్ మరోసారి నీళ్లు చల్లేసాడు. ఈ చిత్రాన్ని మళ్లీ వాయిదా వేస్తున్నట్లు సమాచారం. అదే నెల 24న రిలీజ్ చేయాలని చూస్తున్నారుట. రిలీజ్ ఆలస్యమైనా రెండు నెలల వ్యవధిలోనే ధనుష్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం ఓ రకంగా అభి మానులకు కాస్త ఉపశమనం లాంటింది. అలాగే ధనుష్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'కుబేర' కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందకు రానుంది.
భారీ అంచనాల మధ్య శేఖర్ కమ్ములా తెరకెక్కిస్తోన్న గ్యాంగ్ స్టర్ చిత్రమిది. 'కెప్టెన్ మిల్లర్', 'రాయన్' లాంటి పవర్ పుల్ కంటెంట్ చిత్రాల తర్వాత రిలీజ్ అవుతున్న చిత్రమిది. ఆ రెండు చిత్రాలను మించి 'కుబేర' ఉంటుందని అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.