40 ఏళ్ల క్రితంనాటి రాజ‌కీయాల్ని కెలుకుతోన్న హీరో!

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్నారు.

Update: 2023-09-04 00:30 GMT

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్నారు. పాన్ ఇండియాలోనూ క్రేజ్ సంపాదించిన న‌టుడు. తెలుగులో ఇప్పుడిప్పుడే మ‌రింత పాపుల‌ర్ అవుతున్నాడు. ఇటీవ‌లే సార్ సినిమాతో ఆయ‌న మార్కెట్ రేంజ్ పెరిగింది. ఈ నేప‌థ్యంలో శేఖ‌ర్ క‌మ్ములాని తెర‌పైకి తీసుకొచ్చి త‌న 51వ చిత్రాన్ని లాక్ చేసారు.

అయితే అంత‌కు ముందు 50వ చిత్రం బాధ్య‌త‌లు మాత్రం తానే స్వ‌యంగా తీసుకున్నాడు. ఆ చిత్రాన్ని ధ‌నుష్ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్నారు. డీ 51 వ‌ర్కింగ్ టైటిల్ తో సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. తాజాగా ఈ సినిమా లైన్ లీకైంది. 40 ఏళ్ల క్రితం నాటి రాజ‌కీయ నేప‌థ్య‌మున్న సినిమా ఇదని తెలుస్తోంది. అప్పుడు చోటుచేసుకున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్ని ..కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా ఈ చిత్రం ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది.

ఇందులో కొన్ని వివాదాస్ప‌ద అంశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. అయితే ఈ క‌థ‌ని ఎలా మౌల్డ్ చేయ‌బో తున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. 40 ఏళ్ల క్రితం నాటి రాజకీయ ప‌రిస్థితుల‌కు ఇప్ప‌టి రాజ‌కీయాల్నిముడి పెట్ట‌బోతున్నారా? లేక కేవ‌లం నాటి రాజ‌కీయాన్ని అప్పటి కోణంలోనే చెబుతున్నారా? అన్న‌ది తెలియాలి. కోలీవుడ్ లో ఇప్పటి క‌న్నా అప్పటి రాజ‌కీయం మ‌రింత వేడిగా ఉండేది. రాజ‌కీయాల ప‌రంగా దేశంలోనే పెద్ద ఎత్తున చ‌ర్చించుకునే రాష్ట్రం త‌మిళ‌నాడు.

అలాంటి రాజ‌కీయాల్లో చాలా కాలం తర్వాత ధ‌నుష్‌ వేలు పెడుతున్నాడు. ఈ నేప‌థ్యంలో సినిమా వివాదాల‌కు కేంద్ర బిందువు అవ్వ‌డానికి అవ‌కాశం ఉంద‌ని కోలీవుడ్ మీడియా క‌థ‌నాల వెడెక్కిస్తున్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారభం కానుంది. ఇది పూర్త‌యిన వెంట‌నే శేఖ‌ర్ క‌మ్ములా ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తున్నారు. ఇందులో నాగార్జున‌..రష్మిక కూడా న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం.

Tags:    

Similar News