ఎన్టీఆర్, పవన్.. కిక్కిచ్చేలా ధనుష్ కామెంట్!
హీరో ధనుష్ ఈ ఈవెంట్ లో పాల్గొని సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాయన్ సినిమాతో జులై 26న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా సిద్ధమైంది. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో మూవీ ఉండబోతుందని తాజాగా వచ్చిన టీజర్ బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో గ్రాండ్ గా నిర్వహించారు. హీరో ధనుష్ ఈ ఈవెంట్ లో పాల్గొని సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
అలాగే తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్లలో ఎవరితో మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ మూవీ చేయాలనే ఆలోచన ఉందని తన మనసులో మాటని బయటపెట్టారు. అయితే తెలుగులో తన ఫేవరెట్ హీరో అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు.
ఇతర హీరోల ఫ్యాన్స్ ఎవరు దయచేసి హర్ట్ అవ్వద్దు అని చెప్తూనే తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని ధనుష్ క్లారిటీ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ఈవెంట్ ఒక్కసారిగా ప్రేక్షకుల రీ సౌండ్ తో నిండిపోయింది. ఇదిలా ఉంటే ధనుష్ ఇప్పటికే తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ మూవీ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కింగ్ నాగార్జున తో కలిసి మల్టీస్టారర్ చిత్రంగా కుబేర మూవీ చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కుబేర సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవ్వనుందని సమాచారం. రాయన్ సినిమా టీజర్ తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ కావడంతో మూవీ పైన అంచనాలు బాగానే క్రియేట్ అయ్యి ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమాతో మరో హిట్ ని తెలుగులో ధనుష్ సొంతం చేసుకుంటాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే తెలుగులో కింగ్ నాగార్జునతో మల్టీస్టారర్ చిత్రాన్ని ధనుష్ చేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎన్టీఆర్ మూవీ ఎక్స్ పెక్ట్ చేయొచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం సౌత్ లో పాన్ ఇండియా కల్చర్ నడుస్తోంది. స్టార్ దర్శకులు లార్జెర్ దెన్ లైఫ్ కథలను రెడీ చేస్తున్నారు. దీంతో మల్టీస్టారర్ సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవేళ ఈ కాంబోలో మూవీ తెరకెక్కితే మాత్రం ఖచ్చితంగా సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా అది మారే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.