డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
కచ్చితంగా ఈ చిత్రంతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి సంక్రాంతి రేసులో రాబోతున్న 'డాకు మహారాజ్' పైన అభిమానులు చాలా అంచనాలతో ఉన్నారు. కచ్చితంగా ఈ చిత్రంతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
100 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ మూవీ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. తాజాగా డల్లాస్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అక్కడే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి యుట్యూబ్ లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య నుంచి నందమూరి ఫ్యాన్స్ ఎలాంటి అంశాలు అయితే కోరుకుంటారో అవన్నీ ఈ చిత్రంలో ఉన్నట్లు ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది.
ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్పటికే క్లోజ్ అయ్యింది. అన్ని చోట్ల ఫ్యాన్సీ ధరలకి ఈ మూవీ రిలీజ్ రైట్స్ ని డిస్టిబ్యూటర్స్ సొంతం చేసుకున్నారు. నైజాంలో ఈ మూవీ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. మిగిలిన ప్రాంతాలలో సాలిడ్ ధరకి రైట్స్ అమ్ముడయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాకి 83 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అంటే బాక్సాఫీస్ వద్ద 84 కోట్ల షేర్ అందుకుంటేనే హిట్టయినట్లు లెక్క.
బాలయ్య కెరియర్ లోనే అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ ఈ సినిమాకే జరగడం విశేషం. ఇక ఈ సినిమాతో షేర్ పరంగా కూడా బాలకృష్ణ 100 కోట్ల క్లబ్ ల చేరే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో గ్రాస్ కలెక్షన్స్ లలో 100 కోట్ల మైలురాయిని దాటాడు. అయితేషేర్ పరంగా మాత్రం 100 కోట్ల క్లబ్ లో చేరలేదు.
ఈ సినిమా మాత్రం కచ్చితంగా ఆ మార్క్ ని అందుకుంటుందని అనుకుంటున్నారు. సంక్రాంతి ఫెస్టివల్ బాలయ్యకి బాగా కలిసొచ్చే సమయం ఈ టైంలో అతనికి ఎక్కువ సక్సెస్ లు వచ్చాయి. 'డాకు మహారాజ్' హిట్ అయితే బాలకృష్ణ మార్కెట్ వేల్యూ పెరుగుతుంది. అలాగే అఖండ 2 సినిమాకి కూడా రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా నటించారు. ఇక బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించారు. జనవరి 12న ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. మూవీకి ఏపీలో ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. వీటి టికెట్ ధరలు కూడా భారీగా నిర్ణయించారు.