'వేర్ ఈజ్ ఎంబీ'... మోహన్ బాబు అమెరికా వెళ్లిపోయారా?

దీంతో.. ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది.

Update: 2024-12-30 07:16 GMT

మంచు ఫ్యామిలీ వివాదం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జర్నలిస్టు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో.. ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది.

ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఇటీవల తీర్పు వెలువరించింది. మరోపక్క జర్నలిస్టుపై దాడి అనంతరం విచారణకు రావాల్సి ఉండగా.. మోహన్ బాబు ఆస్పత్రిలో ఉండటంతో ఆయన విచారణతో పాటు అరెస్టు నుంచి ఈ నెల 24వ తేదీ వరకూ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. అయితే.. ఆ గడువు ఇప్పటికే ముగిసింది.

మరోపక్క ముందస్తు బెయిల్ కోసం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో... మోహన్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో... ప్రస్తుతం మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారని అంటున్నారు.

అవును... జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ ను హైకోర్టు ఇటీవల కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో.. మోహన్ బాబును విచారణకు రమ్మని పోలీసులు ఆదేశించగా.. అందుకు కొంత సమయం కావాలని మోహన్ బాబు కోరడం.. ఈ సమయంలో ఇచ్చిన గడువు ముగియడం జరిగిపోయింది!

ఈ నేపథ్యంలో... విచారణకు రమ్మని పిలిచేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటుండగా మోహన్ బాబు ఆచూకీ లభించలేదనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇటీవల తిరుపతిలో ఉన్నారని, చంద్రగిరిలో ఉన్నారని తెలిసిందని చెబుతున్నారు. అయితే.. అక్కడా ఆరా తీయగా.. మోహన్ బాబు అక్కడ కూడా లేరని తేలిందని చెబుతున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబు అమెరికాలో తలదాచుకున్నారని చర్చ నడుస్తుందని అంటున్నారు. ఈ నెల 16న హైదరాబాద్ నుంచి చంద్రగిరికి వెళ్లిన మోహన్ బాబు.. హైకోర్టులో ఎదురైన పరిణామాల నేపథ్యంలో అక్కడ నుంచి అమెరికాకు వెళ్లిపోయారా అనే చర్చ జరుగుతుందని అంటున్నారు.

కాగా.. ఇటీవల మోహన్ బాబు మనవడిని చూడటానికని దుబాయ్ కూడా వెళ్లివచ్చారని అంటున్నారు. అయితే.. ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించడంతో అమెరికా వెళ్లిపోయారనే చర్చ ‘ఎంబీ’ వర్గాల్లోనూ మొదలైందని తెలుస్తోంది. మరి ఈ ప్రచారాలు, చర్చలకు ముగింపు పలుకుతూ మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా అయినా స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News