రూమ్ మేట్ కి రాజా డైరెక్ట‌ర్ ఛాన్స్ ఇవ్వ‌లేదా?

ఫ‌లితం సంగ‌తి ప‌క్క‌న బెడితే ర‌వితేజ స్నేహానికి ఎంత విలువ‌నిస్తాడు? అన్నది మ‌రోసారి ప్రూవ్ అయింది.

Update: 2024-08-10 23:30 GMT

మాస్ రాజా ర‌వితేజ స్నేహితుల‌కు..కొత్త వాళ్ల‌కు అవ‌కాశాలివ్వ‌డంలో ముందుటాడు. ర‌వితేజ అవ‌కాశం ఇవ్వ‌డంతో ద‌ర్శ‌కులుగా నిల‌దొక్కుకున్న వారెంతో మంది. చివ‌రికి ఎన్నో ప్లాప్ ల్లో ఉన్న శ్రీను వైట్ల‌కు కూడా రాజా పిలిచి మ‌రీ అవకాశం ఇచ్చాడు. ఇద్ద‌రు ఒక‌ప్పుడు ఎన్నో హిట్ సినిమాలు చేసిన కాంబినేష‌న్ . అదే న‌మ్మ‌కంతో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఛాన్స్ ఇచ్చాడు. ఫ‌లితం సంగ‌తి ప‌క్క‌న బెడితే ర‌వితేజ స్నేహానికి ఎంత విలువ‌నిస్తాడు? అన్నది మ‌రోసారి ప్రూవ్ అయింది.

అలాగే కొత్త ద‌ర్శ‌కుల్ని ఎంక‌రేజ్ చేయ‌డం లోనూ ముందుటారు. అయితే మ‌రో స్నేహితుడు వై.వి.ఎస్ చౌద‌రికి మాత్రం ర‌వితేజ ఇంత వ‌ర‌కూ ఛాన్స్ ఇవ్వ‌క‌పోవ‌డం అన్న‌ది ఆలోచించాల్సిన విష‌య‌మే. వీళ్లిద్ద‌రు కూడా చాలా క్లోజ్ అని తెలుస్తోంది. ఇద్ద‌రు క‌లిసి ఒకే రూమ్ లో ఎనిమిదేళ్ల పాటు ఉన్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చౌద‌రి ఇటీవ‌ల రివీల్ చేసాడు. వై.వి.ఎస్ చౌద‌రి చాలా కాలంగా అవకాశాలు రాక ఖాళీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

`రేయ్` త‌ర్వాత చౌద‌రి మ‌రో సినిమా చేయ‌లేదు. ఆ సినిమా రిలీజ్ కి కూడా చాలా స‌మయం ప‌ట్టింది. అప్ప‌టి నుంచి ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమా చేయ‌లేదు. ఇటీవ‌లే నంద‌మూరి హ‌రికృష్ణ మ‌న‌వ‌డుతో ఓ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అంటే దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత వై.వి.ఎస్ నుంచి కొత్త సినిమా క‌బురొచ్చింది. మ‌రి ఈ తొమ్మిదేళ్ల‌లో ర‌వితేజాకు ఏనాడు చౌద‌రి క‌నిపించ‌లేదా? ఈ స‌మ‌యంలో ఎంతో మంది ద‌ర్శ‌కుల‌తో మాస్ రాజా సినిమాలు చేసాడు? అందులో కొత్త వాళ్లు కూడా ఉన్నారు.

కానీ ఎన్నో భారీ విజ‌యాలు అందించిన వై.వి.ఎస్ చౌద‌రికి మాత్రం ఆ ఛాన్స్ రాలేదు. మ‌రి ఆ ఛాన్స్ ర‌వితేజ తీసుకోలేదా? ఒక‌వేళ తీసుకున్నా చౌద‌రి కావాల‌ని వ‌ద్దు అనుకున్నాడా? అన్న‌ది తెలియ‌దు. అయితే నిర్మాత‌గా మాత్రం ర‌వితేజ‌తో ఓ సినిమా చేసాడు. అదే `నిప్పు`. కానీ ఆ సినిమా డిజాస్ట‌ర్ అయింది. భారీ న‌ష్టాలు వ‌చ్చాయి.

Tags:    

Similar News