అంబానీల పెంపుడు కుక్క ప్రయాణించే కార్ ఖరీదు తెలుసా?
ముంబై జియో వరల్డ్ సెంటర్ లో అనంత్ అంబానీ- రాధిక పెళ్లి వేడుకలు జరిగాయి.
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ల అంగరంగ వైభవమైన పెళ్లి వేడుకలు ఇటీవల అంతటా హాట్ టాపిక్. నెలల పాటు సాగిన సంబరాల్లో ప్రీవెడ్డింగ్ ప్రణాళికలు, పెళ్లి వేడుక అనంతరం ఇప్పుడు అంబానీలు తిరిగి తమ వ్యాపారాల్లో తలమునకలు అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, వ్యాపార ప్రముఖులు ఈ గ్రాండ్ వెడ్డింగ్ కి హాజరయ్యారు. ముంబై జియో వరల్డ్ సెంటర్ లో అనంత్ అంబానీ- రాధిక పెళ్లి వేడుకలు జరిగాయి.
అయితే ఈ పెళ్లి వేడుక వద్ద అందరి దృష్టిని ఆకర్షించింది విలాసవంతమైన కార్లు. అనంత్ అంబానీ , అతడి కుటుంబం భారీగా అలంకరించిన రోల్స్ రాయిస్ S680 మేబ్యాక్ కార్లలో వేదిక వద్దకు వచ్చారు. అయితే ఇస్టైల్ అంబానీల కోసం మాత్రమే కాదు.. వారి గోల్డెన్ రిట్రీవర్ - హ్యాపీ (కుక్క) కూడా ఈ విలాసవంతమైన కార్ లో వేదిక వద్దకు వచ్చింది. ఆటోమొబిలి ఆర్డెంట్ ఇండియా వివరాల పోస్ట్ ప్రకారం... అంబానీ కుటుంబానికి ఇష్టమైన పెంపుడు కుక్క హ్యాపీ. రూ. 4 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ G 400డిలో ప్రయాణిస్తుంది. అంబానీ ఫ్లీట్‌లో భద్రత కోసం G 63 AMG వంటి హై-ఎండ్ వాహనాలు ఉన్నాయి. వీటిలో జి 400డి కార్ లో ప్రత్యేకంగా హ్యాపీ కోసం కొనుగోలు చేసినది. గతంలో హ్యాపీ టయోటా ఫార్చ్యూనర్, టయోటా వెల్‌ఫైర్‌ను ఉపయోగించుకునేది. కానీ ఇప్పుడు జి 400 డిలో రాజసాన్ని కనబరుస్తోంది.
హ్యాపీ అనంత్ అంబానీ పెంపుడు కుక్క.. వివాహ వేడుకల్లోను హైలైట్ గా కనిపించింది. న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్‌లో అనంత్‌తో కలిసి ఈ కుక్క నడుస్తున్న ఫోటోలు కూడా గతంలో వైరల్ అయ్యాయి. ఈ లక్కీ డాగ్ పార్క్ ఔటింగ్‌లలో G-వాగన్ లో విమానాశ్రయానికి వెళ్లడం, ఆ తర్వాత NYCకి ప్రైవేట్ జెట్ లో ప్రయాణించడం వగైరా విలాసాలకు సంబంధించిన ఫోటోలు కూడా ఇంతకుముందు వైరల్ అయ్యాయి. అంబానీల లగ్జరీ లైఫ్ స్టైల్ కేవలం మనుషులకు మాత్రమే కాదు.. వారి పట్ల విశ్వాసంగా ఉన్న జంతువులకు కూడా. విశ్వాసపాత్రులకు ఇలాంటి ఖరీదైన సౌకర్యాలు ఇవ్వడం తప్పేమీ కాదు.