మనోరథంగల్ ఎలా ఉంది..!

మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ తో పాటుగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా ఈ సీరీస్ లో భాగం అయ్యారు.

Update: 2024-08-16 10:07 GMT

ఎంత పెద్ద స్టార్ స్టేటస్ ఉన్నా.. ఎలాంటి ప్రయోగాలకైనా సిధ్దం అని చెప్పే ఇండస్ట్రీ మలయాళ పరిశ్రమ మాత్రమే. అక్కడ స్టార్స్ అంతా కూడా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా ఫ్యాన్స్ ని మెప్పించే సినిమాలు కాదు వారి మనసుకు నచ్చే కథలను ఫ్యాన్స్ కి చూపించే ప్రయత్నాలు చేస్తారు. అందుకే మలయాళం నుంచి వచ్చే సినిమాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే ఓటీటీ లో వెబ్ సీరీస్ లు చేస్తూ మెప్పిస్తున్నారు అక్కడ స్టార్స్. ఐతే లేటెస్ట్ గా మలయాళ స్టార్స్ అంతా కలిసి చేసిన ఆంథాలజీ మనోరథంగల్. మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ తో పాటుగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా ఈ సీరీస్ లో భాగం అయ్యారు.

9 సీరీస్ లతో వచ్చిన ఈ ఆంథాలజీని ప్రముఖ దర్శకులు డైరెక్ట్ చేశారు. లేటెస్ట్ గా జీ 5 లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటుంది. ఫేమస్ రైటర్, డైరెక్టర్ ఎం.టి వాసుదేవన్ నాయర్ రాసిన కథల ఆధారంగా ఆంథాలజీ సీరీస్ మనోరథంగల్ తెరకెక్కింది. మలయాళ స్టార్స్ అంతా కూడా ఈ సీరీస్ లో భాగం అవ్వడంతో ఆటోమెటిక్ గా మనోరథంగల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

స్నేహితుడు చెల్లితో ప్రేమలో పడిన బాపుట్టి కథతో ఒలవుం తీరవుం ఎపిసోడ్ ఆకట్టుకుంది. ప్రేమించిన అమ్మాయిని వదుకోలేక బాపుట్టి ఏం చేశాడు అన్నది ఈ ఎపిసోడ్ స్టోరీ. మోహన్ లాల్, దుర్గా కృష్ణ నటించిన ఈ ఎపిసోడ్ ను ప్రియదర్శన్ డైరెక్ట్ చేశారు.

జర్నలిస్ట్ వేణు గోపాల్ తన సిస్టర్ లీలా కోసం చేసే ప్రయాణం తో కడుగన్నావా ఎపిసోడ్ నడిచింది. ఈ ఎపిసోడ్ ను రంజిత్ డైరెక్ట్ చేశారు. సోదరి కోసం శ్రీలంక వెల్లిన వేణు గోపాల్ లీలా ఆచూకి కనిపెట్టాడా లేదా అన్నది ఆసక్తికరంగా మలిచారు.

మరోపక్క మూడో ఎపిసోడ్ కజ్ చా.. భర్తతో గొడవ వల్ల పుట్టింటికి వచ్చిన మహిళ కథతో తెరకెక్కించారు. అలా వచ్చిన ఆమెను చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలు ఎలా అంటారు. వాటిని ఆమె ఎలా తీసుకుంది. చిన్ననాటి స్నేహితురాలి మాట తో వచ్చిన మార్పు ఏంటి అన్నది ఈ కథ. పార్వతీ తిరువోతు నటించిన ఈ ఎపిసోడ్ ను శ్యాం ప్రసాద్ డైరెక్ట్ చేశారు.

రోజులు మరుతున్నా కొద్దీ ప్రజలు ఎలా మారుతున్నారు. మానవత్వం లేకుండా ఎలా పోతుంది అన్నది శిలాలిఖితం తో చెప్పారు. ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన ఈ ఎపిసోడ్ లో బిజూ మీనన్ లీడ్ రోల్ లో నటించారు. ఇక వీటితో పాటు విల్పనా అంటూ మానవ సంబంధాల మీద రెండు పాత్రలతో చెప్పే ప్రయత్నం చేశారు. షెర్లాక్ టైటిల్ తో సొంతూరు విడిచి వెళ్లిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది చూపించారు. మహేష్ నారాయణన్ డైరెక్ట్ చేసిన ఈ ఎపిసోడ్ లో ఫహద్ ఫాజిల్ నదియా లీడ్ రోల్ లో నటించారు. ఇందులో షెర్లాక్ అనే పిల్లికి ఒక స్పెషాలిటీ ఉంటుంది.

కాదలక్కాట్టు అంటూ పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న కేశవ్ అనే వ్యక్తి కథ ఉంటుందో చూపించారు. రతీష్ అంబటి ఈ ఎపిసోడ్ ను డైరెక్ట్ చేశారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఎంత సాంకేతికంగా అభివృద్ధి చెందినా కూడా ప్రకృతి ఒడిలోకి వెళ్లాల్సిందే అంటూ అభ్యం తీడీ వీండుం కథ చెబుతుంది. సంతోష్ శివన్ దీనికి డైరెక్ట్ చేశారు.

ఫైనల్ ఎపిసోడ్ స్వర్గం తురుక్కున్న సమయం పిల్లలకు దూరమైన వృద్ధుల గురించి వారి ఎమోషన్స్ తో ఎపిసోడ్ తీశారు. ఇలా 9 ఎపిసోడ్స్ 9 కథలతో వచ్చింది మనోరథంగల్. ఐతే వీటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ స్టార్స్ చేసిన ఎపిసోడ్స్ బాగున్నాయి. ప్రతి ఎపిసోడ్ కమల్ హాసన్ పరిచయం చేసి చెప్పడం ఇందులో ప్రధాన ఆకర్షణ. కొన్ని ఎపిసోడ్స్ లో ఎమోషన్స్ బాగున్నా సాగదీయడం వల్ల కాస్త ట్రాక్ తప్పినట్టు అవుతుంది. మనోరథంగల్ ఒక మంచి ప్రయత్నమే కానీ ప్రేక్షకులు కోరుకుఏ ట్విస్ట్, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఎగ్జైట్ మెంట్ కలిగించలేదు. డ్రామా సీరీస్, సినిమాలు చూసే వారికి నచ్చే ఛాన్స్ ఉంది. ఐతే వాటిని చూడని వారికి ఇది అంతగా రుచించడం కష్టం.

Tags:    

Similar News