గేమ్ ఛేంజర్ ఇక రిలీజ్ విషయంలో టెన్షన్ అక్కర్లే
ఈ నేపథ్యంలోనే దిల్ రాజు రీసెంట్‌గా గేమ్ ఛేంజర్ డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని, సినిమా క్రిస్మస్ 2024లో విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు.
రామ్ చరణ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా *గేమ్ ఛేంజర్* పై మళ్ళీ ఫోకస్ పెరుగుతోంది. దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు సరికొత్త ప్లాన్ తో సినిమా పనులను మరింత వేగవంతం చేశారు, మాస్ ఆడియెన్స్ మరియు మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. చరణ్ ఈ ప్రాజెక్టులో తన వర్క్ ను ఇప్పటికే పూర్తిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి చివరి షెడ్యూల్ మాత్రమే షూటింగ్ మిగిలి ఉంది.
అయితే, శంకర్ పనితీరుపై అభిమానుల్లో కొంత అనుమానం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు రీసెంట్‌గా గేమ్ ఛేంజర్ డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని, సినిమా క్రిస్మస్ 2024లో విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ లో జోష్ అయితే వచ్చింది. *గేమ్ ఛేంజర్* డబ్బింగ్ ప్రారంభం కావడం ఫ్యాన్స్‌కు ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. సోషల్ మీడియాలో "మెగా ఫైర్ వర్క్స్‌కి రెడీ అయిపోండి" అంటూ రాజు గారు షేర్ చేసిన డబ్బింగ్ సెషన్ ఫొటోలు వెంటనే వైరల్ అయ్యాయి.
దిల్ రాజు మాట ఇచ్చారంటే సినిమా రిలీజ్ అవ్వడమే అంటూ ఫ్యాన్స్ ఒక బలమైన నమ్మకంతో ఉన్నారు. డిసెంబర్‌లో ప్రేక్షకులకు పండగ రాబోతుందని, థియేటర్లలో హంగామా ఖాయం అంటూ గేమ్ ఛేంజర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో, మరో భారీ సినిమా పుష్ప 2 కూడా డిసెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ రాక కన్ఫార్మ్ కావడంతో రెండు సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా రావడం వల్ల మెగా అభిమానులు, అల్లు అభిమానులు మధ్య పోటీ మొదలైంది.
పుష్ప 2 వాయిదా పడకూడదని కోరుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో తమ డిమాండ్లు పెడుతున్నారు. ఇక శంకర్ ఇప్పుడు *గేమ్ ఛేంజర్* పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం విశేషం. భారతీయుడు 2 ఫెయిల్యూర్ అనంతరం గేమ్ ఛేంజర్ మీద మరింత ఒత్తిడి నెలకొంది. తన పని ద్వారా విమర్శలకు సమాధానం ఇవ్వాలని శంకర్ భావిస్తున్నారు.
ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను.కొనసాగిస్తూనే ప్రమోషన్ డోస్ కూడా పెంచాలని అనుకుంటున్నారు. రామ్ చరణ్ అభిమానులు *గేమ్ ఛేంజర్* తో భారీ హిట్ ఖాయం అని విశ్వసిస్తున్నారు. అనంతరం, శంకర్ *భారతీయుడు 3 పై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. భారతీయుడు 2 ఫెయిల్ అయినా, పార్ట్ 3 తప్పక సక్సెస్ అవుతుందని శంకర్ గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ, గేమ్ ఛేంజర్ తో మొదట పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి.కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.