గేమ్ ఛేంజర్.. పైసా తేడా రాకుండా దిల్ రాజు జాగ్రత్తలు!

ఇక ముందుగా గేమ్ ఛేంజర్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవాలి ఆయన ఎంతో గ్రాండ్ గా ఆ సినిమాను మొదలుపెట్టారు.

Update: 2024-05-03 11:33 GMT

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశంలోనే మంచి సక్సెస్ రేటు అందుకున్న నిర్మాతలలో దిల్ రాజు కూడా టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలు బడా సినిమాలు అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాలను రూపొందించగలరని చాలాసార్లు నిరూపించారు. ఇక రాబోయే రోజుల్లో దిల్ రాజు నుంచి మరిన్ని ఫ్యాన్ ఇండియా సినిమాలు కూడా రాబోతున్నాయి.

ఇక ముందుగా గేమ్ ఛేంజర్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవాలి ఆయన ఎంతో గ్రాండ్ గా ఆ సినిమాను మొదలుపెట్టారు. అయితే డైరెక్టర్ శంకర్ కారణంగా సినిమా షూటింగ్ చాలాసార్లు వాయిదా పడింది. ఆయన ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉండడంతో గేమ్ చేజర్ కు సంబంధించిన షెడ్యూల్స్ లలో చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది.

ఇక ఇటీవల మొత్తానికి శంకర్ భారతీయుడు 2 ప్రాజెక్టును ఫినిష్ చేయడంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ అయితే పెట్టారు ఇక ఈ క్రమంలో దిల్ రాజు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ప్రతి షెడ్యూల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక సినిమాను స్టార్ట్ చేస్తే ఆయన కొన్ని షెడ్యూల్స్ వరకు ఉంటారు. ప్రతిరోజు అక్కడే చూసుకుంటూ ఉండే పరిస్థితి ఉండదు. తన టీమ్ కు చెప్పేసి వెళ్ళిపోతారు.


ఎందుకంటే దిల్ రాజు ప్రొడక్షన్లో ఒకేసారి నాలుగైదు సినిమాలకు సంబంధించిన పనులు కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని ప్రాజెక్టుల విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం మిగతా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా కూడా దిల్ రాజు ఫోకస్ ఎక్కువగా గేమ్ ఛేంజర్ పైనే ఉంది. రీసెంట్ గా చెన్నైలో ఓ కీలకమైన షెడ్యూల్ జరగ అక్కడ నుంచి ఆయన కదల్లేదు.

ప్రతి చిన్న సన్నివేశంలో కూడా శంకర్ తో పాటే షూటింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అవుట్ ఫుట్ విషయంలో మాత్రమే కాకుండా బడ్జెట్ పై కూడా ఓ కన్నేసి ఉంచారు. ఇప్పటికే బడ్జెట్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి ఏ షెడ్యూల్లో కూడా అనవసర ఖర్చులు ఉండకుండా కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల ఆయన నిర్మించిన ఫ్యామిలీ స్టార్ కాస్త నష్టాలను కలుగజేసిన విషయం తెలిసిందే.

అలాగే అంతకుముందు వచ్చినా రెండు మూడు సినిమాలు కూడా పెద్దగా కలెక్షన్స్ ఏమీ రాబట్టలేదు. ఇక దిల్ రాజు ఇప్పుడు గేమ్ ఛేంజర్ పైనే భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టాడు. దాదాపు 240 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కావున ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడ పొరపాట్లు జరగకుండా బడ్జెట్ పరిధి దాటకుండా ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నట్లు సమాచారం. ఇక సినిమాను ఈ ఏడాది చివరలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News