ఇండియన్ 2.. దిల్ రాజు ఎందుకు నమ్మలేదు?

ఎందుకంటే 2005లో వచ్చిన భారతీయుడు సినిమా నైజాం హక్కులను కూడా ఆయనే సొంతం చేసుకున్నారు. ఆ సినిమాతోనే దిల్ రాజు దశ తిరిగింది,

Update: 2024-02-21 12:30 GMT

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాపై మొదట్లో అంచనాలు అయితే గట్టిగానే పెరిగాయి. 1996లో వచ్చిన భారతీయుడు సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అయితే మళ్లీ చాలాకాలం తర్వాత దర్శకుడు భారతీయుడు పాత్రను వెండితెరపై గ్రాండ్ గా ఆవిష్కరించబోతున్నాడు.

అయితే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకువచ్చి చాలా కాలం అయ్యింది. లైకా ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా కంటే ముందే స్టార్ట్ అయింది. ఇక తర్వాత వివిధ కారణాల వలన ఆలస్యం అవుతూ వచ్చింది. మధ్యలో శంకర్ ఇండియన్ 2 ప్రాజెక్టును వదిలేసి దిల్ రాజు ప్రొడక్షన్లో గేమ్ ఛేంజర్ సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

ఇక తర్వాత మళ్లీ ఊహించని విధంగా ఇండియన్ 2 ప్రాజెక్టును రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలు కూడా మొదలైపోయాయి. త్వరలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే తెలుగులో ఈ సినిమా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకుంటారని అందరూ అనుకున్నారు.

ఎందుకంటే 2005లో వచ్చిన భారతీయుడు సినిమా నైజాం హక్కులను కూడా ఆయనే సొంతం చేసుకున్నారు. ఆ సినిమాతోనే దిల్ రాజు దశ తిరిగింది, డిస్ట్రిబ్యూటర్ గా మరొక లెవెల్ కు చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎక్కువ శాతం శంకర్ సినిమాలను ఆయన తెలుగులో రిలీజ్ చేస్తూ వచ్చారు. అంతే కాకుండా ఇప్పుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మిస్తున్నారు.

అసలైతే ఇండియన్ 2 సినిమాను దిల్ రాజు నిర్మించాలని మొదట అనుకున్నారు. కానీ ఎందువల్లనో ఆ సినిమాకు రాజు దూరమయ్యాడు. ఇక ఇప్పుడు తెలుగులో ఇండియన్ 2 బిజినెస్ వ్యవహారంపై కూడా పెద్దగా ఫోకస్ చేయడం లేదు. తెలుగు హక్కులను ఏషియన్ సినిమాస్ సురేష్ ప్రొడక్షన్స్ కలిసి సొంతం చేసుకున్నారు. వారే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇక లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ 2 సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరి సినిమా విడుదల డేట్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News