దిల్ రాజు.. దెబ్బ పడినా మళ్ళీ అటువైపే..

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు

Update: 2024-07-03 08:39 GMT

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 'జెర్సీ' మరియు 'హిట్' చిత్రాలు రీమేక్ చేసి నిరాశ పడ్డప్పటికీ, దిల్ రాజు తన ప్రయత్నాలు ఆపడం లేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నుంచి ముంబై మధ్య తరచుగా ప్రయాణిస్తూ, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఏడాది రెండు భారీ ప్రాజెక్టులు ప్రారంభించాలని దిల్ రాజు చూస్తున్నాడు. అందులో హిందీ ప్రాజెక్టు ఒకటి.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే ఆ హిందీ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ సెట్టయితే వంశీకి ఇదే తొలి హిందీ సినిమా అవుతుంది. ఇక వీరి సినిమాలో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనుందని వార్తలు వినిపిస్తున్నాయి. 150 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నారని టాక్ ఉంది.

ఒక విధంగా ఇది భారీ రిస్క్, ఎందుకంటే షాహిద్ కపూర్ కి ఇటీవల కాలంలో పెద్దగా సక్సెస్ అయితే లేదు. జెర్సీ కనీసం పెట్టుబడిలో సగం కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. ఇక వారసుడు వంటి కమర్షియల్ సినిమాలు చేసిన వంశీ పైడిపల్లితో సినిమా అంటే మాములు విషయం కాదు. అతను ఇప్పటివరకు కమర్షియల్ హిట్‌లు కొట్టాడు కానీ బాలీవుడ్ లాంటి పెద్ద మార్కెట్‌లో తన మార్కు చాటించాలంటే కాస్త సవాలు గానే ఉంటుంది.

Read more!

ఇటువంటి భారీ ప్రాజెక్టులకు ముందుగా స్క్రిప్ట్ ప్లాన్ ను పక్కాగా సరిచూసి తుది నిర్ణయం తీసుకోవాలి. అయితే దిల్ రాజు ఈ రిస్క్ తీసుకోవడంలో జెట్ స్పీడ్ లోనే ధైర్యాన్ని చూపిస్తున్నారు. తన ముంబై పర్యటనల సమయంలో దిల్ రాజు పలువురు ప్రముఖ బాలీవుడ్ నటులను కలిశాడు. ఈ చర్చలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయని సమాచారం. అలాగే మరికొంత మంది బాలీవుడ్ లో స్టార్ హీరోలు మరియు దర్శకులతో కలిసి పనిచేసే ప్రయత్నంలో దిల్ రాజు ఉన్నాడు.

ఈ సంవత్సరం చివరిలో దిల్ రాజు నుండి భారీ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. బాలీవుడ్ లో తన సత్తా చాటడానికి ఉత్సాహంగా ఉన్న దిల్ రాజు, మంచి కథలు మరియు పెద్ద ప్రాజెక్టులతో ముందుకు రావాలని చూస్తున్నాడు. ఈ ప్రయత్నాలు ఫలితాలనిస్తే, దిల్ రాజు హిందీ చిత్ర పరిశ్రమలో కూడా తన ప్రఖ్యాతిని నిలబెట్టుకుంటాడని ఆశించవచ్చు. మొత్తంగా, టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు దిల్ రాజు ప్రయాణం ఎంతగా విజయవంతమవుతుందో, ఈ సాహసంతో ఏ స్థాయికి వెళ్తాడో చూడాలి.

Tags:    

Similar News

eac