కపుల్ గోల్స్.. దిల్ రాజు, తేజస్విని ఫోటో షూట్ వేరే లెవల్!

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు ఎదిగిన విషయం తెలిసిందే

Update: 2024-06-13 04:56 GMT

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు ఎదిగిన విషయం తెలిసిందే. దిల్ సినిమాతో నిర్మాతగా మారిన ఆయన.. ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా తనకంటూ ఇండస్ట్రీలో స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. దిల్ రాజు బ్యానర్ నుంచి మూవీ వస్తుందంటే చాలు.. మినిమమ్ హిట్ గ్యారెంటీ అని సినీ ప్రియులు ఫిక్స్ అయిపోతారు.

ఇక దిల్ రాజు పర్సనల్ లైఫ్ కూడా తెరిచిన పుస్తకమే. కొన్నేళ్ల క్రితం ఆయన మొదటి భార్య అనిత అనారోగ్య సమస్యలతో మరణించారు. ఆ తర్వాత కుమార్తె ఒత్తిడి మేరకు రెండో వివాహం చేసుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో తన దూరపు బంధువు అయిన తేజస్వినిని పెళ్లి చేసుకున్నారు. 2022లో తేజస్విని ఓ పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చారు. దీంతో 50 ఏళ్ల వయసులో దిల్ రాజు మరోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే.

రీసెంట్ గా తన భార్య, కొడుకు అన్వి రెడ్డితో ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్స్ లో సందడి చేశారు దిల్ రాజు. ఆ సమయంలో బుడ్డోడు చాలా యాక్టివ్ గా కనిపించాడు. అయితే ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు దిల్ రాజు. వెకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ముగ్గురు కలిపి వెకేషన్ లో దిగిన పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి.

ఇప్పుడు దిల్ రాజు, తేజస్విని కపుల్ ఫోటో షూట్ ఆకట్టుకుంటోంది. జీన్స్ షర్ట్ అండ్ షార్ట్ లో దిల్ రాజు, వైట్ కలర్ లాంగ్ డ్రెస్ లో తేజస్విని చూడముచ్చటగా ఉన్నారు. బ్యూటిఫుల్ గా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. రకరకాల పోజులు ఇస్తూ ఫోటోలు దిగారు. బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయింది. ప్రస్తుతం నెటిజన్లు లైకులు కొడుతూ ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు. ఇద్దరూ కలిసి సినిమా చేయొచ్చుగా అని సరదాగా రిక్వెస్ట్ చేస్తున్నారు.

పిక్స్ అదిరిపోయాయని, కపుల్స్ గోల్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. లవ్లీ కపుల్ అంటూ ట్యాగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు, దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, నితిన్ తమ్ముడు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటితోపాటు ఆయన లైనప్ లో 15 సినిమాలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి వరుస సినిమాలతో ఎలాంటి హిట్లు అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News